• తాజా వార్తలు

‘‘గూగుల్ పే’’తో యూపీఐ ద్వారా డ‌బ్బులు పంప‌డం, పొంద‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

‘‘గూగుల్ తేజ్’’ ఇప్పుడు ‘‘గూగుల్ పే’’ అయింది. ఈ యాప్‌ను మ‌న ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం, దానికి బ్యాంకు ఖాతాను జోడించ‌డం లేదా మార్చ‌డం, ఆ త‌ర్వాత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ (UPI)ద్వారా డ‌బ్బులు పంప‌డం, పొంద‌డం గురించి తెలుసుకుందాం.

మ‌న‌మిప్పుడు డిజిట‌ల్ యుగంలో ఉన్నాం.. అందులో భాగంగా ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ల‌ను ఉప‌యోగిస్తున్నాం. ‘‘గూగుల్ పే’’ కూడా అలాంటిదే. ఇప్ప‌టిదాకా నెఫ్ట్‌, ఆర్టీజీఎస్ వంటి ప‌ద్ధ‌తుల్లో డ‌బ్బులు పంప‌డం, తీసుకోవ‌డం చేస్తూ వ‌చ్చాం. ఈ ప‌ద్ధ‌తుల‌తో పోలిస్తే యూపీఐద్వారా ఇలాంటి లావాదేవీలు న‌డ‌పడం చాలా సులభం. మ‌న బ్యాంకు ఖాతానుంచి కేవ‌లం ఓ మెసేజ్ పంపినంత సులువుగా త‌క్ష‌ణం డ‌బ్బు పంప‌వ‌చ్చు లేదా తీసుకోవ‌చ్చు. ఎవ‌రినుంచ‌యినా రావాల్సిన డ‌బ్బును మ‌న బ్యాంకు ఖాతాలో జ‌మ చేయించుకోనూ వ‌చ్చు.

‘‘గూగుల్ పే’’ని ఇలా సెట‌ప్ చేసుకోవ‌చ్చు:

ముందుగా మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ లేదా అంత‌క‌న్నా ఆధునిక వెర్ష‌న్ ఉందేమో చూసుకోండి. ఐ ఫోన్ లేదా ఐప్యాడ్ అయితే అందులో ఐవోఎస్ 8.2 (iOS 8.2) లేదా దానిక‌న్నా ఆధునిక వెర్ష‌న్ ఉండాలి.

స్టెప్ 1: గూగుల్ ప్లే లేదా ఐవోఎస్ (యాప్ స్టోర్‌) నుంచి, ‘‘గూగుల్ పే’’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. త‌ర్వాత యాప్‌ను ఓపెన్ చేసి బ్యాంకు ఖాతాతో లింక్‌చేసిన‌ మీ మొబైల్ నంబ‌రును రిజిస్ట‌ర్ చేసుకోవాలి.

స్టెప్ 2: మీ ఫోన్ నంబ‌రును ‘‘గూగుల్ పే’’ యాప్ ఒక మెసేజ్‌ద్వారా చెక్ చేసుకుంటుంది లేదా ఫోన్‌కు వ‌చ్చే ఒన్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌ను మ‌న‌మే ఎంట‌ర్ చేయ‌వ‌చ్చు.

స్టెప్ 3: ర‌క్ష‌ణ కోసం గూగుల్ వ్య‌క్తిగ‌త గుర్తింపు సంఖ్య (PIN)ను సెట‌ప్ చేసుకోవాలి. మీ ఫోన్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ పిన్‌ను మీరు వాడుకోవ‌చ్చు. గూగుల్ పిన్‌ను ఎంచుకున్న‌ట్ల‌యితే యాప్ అన్‌లాక్ చేసేముందు ఆన్‌లైన్‌లో ఉన్నారో లేదో చూసుకోవాలి.

‘‘గూగుల్ పే’’తో బ్యాంకు ఖాతాను జోడించ‌డం ఎలా:

ఇది చాలా సులభం... అయితే, మీ బ్యాంకు యూపీఐ విధానాన్ని అనుస‌రించేదిగా ఉండాలి.

స్టెప్ 1: ‘‘గూగుల్ పే’’ యాప్‌ను ఓపెన్ చేసి, దానికి ఎగువ‌న‌ ఎడ‌మ‌వైపు మూల‌లో ఉన్న మీ ఫొటోను ట్యాప్ చేయండి. అందులో కొన్ని ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వాటినుంచి ‘‘బ్యాంక్ అకౌంట్‌’’ ఆప్ష‌న్‌ను, ఆ త‌ర్వాత ‘‘యాడ్ బ్యాంక్ అకౌంట్‌’’ను ఎంపిక చేయండి.

 

స్టెప్ 2: యూపీఐ ప‌ద్ధ‌తిని అనుస‌రించే బ్యాంకుల జాబితాను ‘‘గూగుల్ పే’’ చూపుతుంది. వాటినుంచి మీ బ్యాంకును ఎంపిక చేసుకోండి.

స్టెప్ 3: మీకు అప్ప‌టికే యూపీఐ పిన్ ఉన్న‌ట్ల‌యితే దాన్నే ఎంట‌ర్ చేయండి. ఒక‌వేళ అది గుర్తులేక‌పోతే ‘‘ఫ‌ర్‌గాట్ పిన్‌’’ (Forgot PIN) ఆప్ష‌న్‌ను ఎంపిక చేసి, త‌ర్వాత క‌నిపించే సూచ‌న‌ల‌ను పాటించండి.

‘‘గూగుల్ పే’’తో డ‌బ్బు పంపడం ఎలా:

మీ బ్యాంకు ఖాతాను యాప్‌తో జోడించ‌డం పూర్త‌య్యాక డ‌బ్బు పంప‌వ‌చ్చు.. లేదా పొంద‌డం కోసం అభ్య‌ర్థ‌న పంప‌వ‌చ్చు.

స్టెప్ 1: మీరు డ‌బ్బు పంపాల్సిన వ్య‌క్తిని ఎంచుకోండి. వారి మొబైల్ నంబ‌రు లేదా యూపీఐ ఐడీ (UPI ID) లేదా క్యూఆర్ (QR) కోడ్‌ద్వారా డ‌బ్బు పంప‌వ‌చ్చు. లేదంటే.. ‘‘ట్యాప్ ఫ‌ర్ క్యాష్ మోడ్‌’’ను కూడా ఎంచుకోవ‌చ్చు.

స్టెప్ 2: యూపీఐ పిన్‌తో మీ ఖాతాను నిర్ధారించాక మీరు పంపాల్సిన మొత్తాన్ని ఎంట‌ర్ చేసి, చెల్లించండి.

స్టెప్ 3: మ‌న‌కు డ‌బ్బు రావాల్సి ఉంటే- ఆ మొత్తాన్ని ఎంట‌ర్ చేసి, అవ‌స‌ర‌మైతే దానికి వివ‌ర‌ణ జ‌త‌చేసి ‘‘రిక్వెస్ట్‌’’ను నొక్కాలి.

 

స్టెప్ 3: ‘‘ట్యాప్ ఫ‌ర్ క్యాష్ మోడ్‌’’ను ఎంచుకున్న‌ప్పుడు డ‌బ్బు పంపేవారు, తీసుకునేవారు ద‌గ్గ‌ర‌లో ఉండాలి.

‘‘గూగుల్ పే’’లో బ్యాంకు ఖాతాను మార్చ‌డం ఎలా:

స్టెప్‌1: ‘‘గూగుల్ పే’’లోకి వెళ్లి మ‌న ప్రొఫైల్ ఫొటోమీద ట్యాప్ చేయాలి. అందులో బ్యాంక్ అకౌంట్‌ను ఎంపిక చేస్తే మ‌నం జోడించిన బ్యాంకు ఖాతాల జాబితా క‌నిపిస్తుంది. 

స్టెప్ 2: మీరు ఒక‌టిక‌న్నా ఎక్కువ ఖాతాల‌ను జోడించి ఉన్న‌ట్ల‌యితే తొల‌గించాల్సిన బ్యాంకు ఖాతాను ట్యాప్ చేయండి. ఆపైన కుడివైపు మూల‌న క‌నిపించే మూడు చుక్క‌ల‌ను ట్యాప్ చేసి, ‘‘రిమూవ్ అకౌంట్‌’’ ఆప్ష‌న్‌ను ట్యాప్ చేయాలి.

జన రంజకమైన వార్తలు