• తాజా వార్తలు

ఇస్రో భువన్ యాప్‌తో మీరు ఏ స‌ర్వే నెంబ‌ర్‌లో ఉన్నారో తెలుసుకోవ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో మీకు తెలుసా ? అయితే ఇస్రో భువన్ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. మీరు ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ ఇస్రో భువన్ యాప్ ను ఉపయోగించి మనం ఉన్న ప్రదేశం యొక్క సర్వే నెంబర్ ఎలా  తెలుసుకోవాలి అనే  విషయాన్నీ గురించి ఈ ఆర్టికల్ లో తెల్సుకుందాము. అయితే అంతకంటే ముందు అసలు ఈ సర్వే నెంబర్  అంటే ఏమిటి? అనే విషయాన్నీ క్లుప్తంగా తెలుసుకుందాం.

సర్వే నెంబర్ అంటే ఏమిటి?
గత సంవత్సరం తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రం లోని అన్ని భూములను రీ సర్వే చేయించిన విషయం మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే వాస్తవానికి 1906 వ సంవత్సరం లో బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి అవిభక్త భారతదేశం లోని భూములు అన్నింటినీ సర్వే అనగా కొలతలు వేయించింది. దీని ప్రకారం ప్రతీ భూమి ఒక నిర్దిష్టమైన సర్వే నెంబర్ లో ఉంటుంది. ఇలా కొలతలు వేయించిన భూమిని సర్వే ప్రతీ గ్రామానికీ కొన్ని సర్వే నెంబర్ లుగా విడగొట్టి వాటిని RSR అనే రికార్డు లో భద్రపరచారు. RSR అంటే రీ సర్వే అండ్ రీ సెటిల్ మెంట్ రిజిస్టర్. ప్రతీ గ్రామానికీ ఆ గ్రామంలో ఉండే భూమి అంతటికీ ఒక RSR రికార్డు ఉంటుంది.దాదాపుగా దేశం లోని అని రాష్ట్రాలు దీనినే ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. రైతులకు ఈ సర్వే నెంబర్ ల గురించి కొంచెం అవగాహన ఉంటుంది. ఈ రికార్డులు అన్నీ రెవిన్యూ శాఖ అధీనంలో ఉంటాయి.

ఇస్రో భువన్ యాప్ అంటే ఏమిటి?

మన దేశానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ అయిన ఇస్రో ఈ సర్వే నెంబర్ లు తెలుసుకోవడానికి ఒక యాప్ ను ప్రవేశ పెట్టింది. అదే భువన్ యాప్. ఈ యాప్ ను ఉపయోగించి ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం ఈ సర్వే నెంబర్ లో ఉన్నది ఇట్టే తెలుసుకోవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది?

1.      ముందుగా ప్లే స్టోర్ కి వెళ్లి ISRO BHUVAN అనే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
2.      మన ఫోన్ లో గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేసి మీరు ఉన్న కరెంటు లొకేషన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఉన్న బ్లూ డాట్ పై గట్టిగా ప్రెస్ చేస్తే పైన మీకు ఆ ప్రదేశం యొక్క భౌగోళిక నిరూపకాలు కనిపిస్తాయి.

3.       మీరు ఉన్న లొకేషన్ యొక్క భోగోళిక నిరూపకాలను ( అక్షాంశాలు మరియు రేఖాంశాలు ) లేదా కో ఆర్దినేట్స్ ను కాపీ చేసుకోవాలి.
4.      ఇప్పుడు ఇస్రో భువన్ యాప్ ను ఓపెన్ చేయాలి.
5.      ఈ యాప్ ను ఓపెన్ చేస్తే Bhuvan-2D అని రాసి ఉన్న దాని ప్రక్కనే ఒక బాక్స్ కనిపిస్తుంది.
6.      గూగుల్ మ్యాప్స్ లో కాపీ చేసుకున్న కోఆర్డినేట్స్‌ను ఈ బాక్స్ లో పేస్టు చేయాలి.
7.      ప్రక్కనే ఉన్న సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
8.      ఇప్పుడు మీకు భువన్ యాప్‌లో ఉన్న మ్యాప్ పై మీరు ఉన్న ప్రదేశం లో ఒక ఎరుపు రంగు బాణం గుర్తు కనిపిస్తుంది.
9.      ఆ బాణం గుర్తు దగ్గర కొంచెం జూమ్ చేసి చుస్తే మీరు ఉన్న ప్రదేశం ఈ సర్వే నెంబర్ లో ఉందో మీకు చాలా స్పష్టంగా కనపడుతుంది.
10.   అంతే కాదు ఆ ప్రదేశం లో ఉన్న వివిధ సర్వే నెంబర్ లు మరియు వాటియొక్క హద్దులను కూడా ఇక్కడ మనం చూడవచ్చు.
 
చూసారు కదా! ఇలా ఇస్రో భువన్ అనే యాప్ ను ఉపయోగించి ప్రస్తుతం మనం ఉన్న ప్రదేశం ఏ సర్వే నెంబర్ లో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.  మరి ఇక ఎందుకు ఆలస్యం, వెంటనే ఈ యాప్ ను మీ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని మీరు ఉన్న ప్రదేశం యొక్క సర్వే నెంబర్ ను తెలుసుకోండి. మరికొంతమందికి తెలియజేయండి.

 
 

 

జన రంజకమైన వార్తలు