• తాజా వార్తలు

టిక్‌టాక్ ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాడుకోవడం ఎలా? 

  • - ఎలా? /
  • 3 సంవత్సరాల క్రితం /

ఇండియాలో విప‌రీతంగా పాపుల‌ర్ అయి ఇటీవ‌ల నిషేధానికి గురైన చైనా యాప్ టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయంగా చింగారి, రొపోసో యాప్స్ హ‌డావుడి చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ గ్రూప్ కూడా టిక్‌టాక్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి  త‌న ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో రీల్స్ ఫీచ‌ర్‌ను యాడ్ చేసింది. ఇంత‌కుముందు ఇన్‌స్టాలో వ‌చ్చిన బూమ్‌రాంగ్ లాంటిదే ఈ ఫీచ‌ర్ 

 ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను క్రియేట్ చేసుకోవ‌డం ఎలా? 
* ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి కింద భాగంలో ఉన్న కెమెరా ద్గ‌గ‌ర ఉన్న రీల్స్‌ను సెలెక్ట్ చేయండి.  

* ఆడియో ఆప్ష‌న్ క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్ర‌రీలో మీకు న‌చ్చిన ఆడియోను సెలెక్ట్  చేసుకోండి.

* మీరు కావాలంటే టిక్‌టాక్‌లో మీదిరిగా మీ సొంత ఆడియోను కూడా రికార్డ్ చేసుకోవ‌చ్చు. 

* మీ వీడియో మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చ‌డానికి ఏఆర్ ఎఫెక్ట్స్‌ను కూడా యాడ్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం రీల్స్ కెమ‌రాలో ఎఫెక్ట్స్‌ను క్లిక్ చేసి ఏఆర్ ఎఫెక్ట్స్‌ను టాప్ చేయండి. 

* మీరు క్రియేట్ చేసిన వీడియోను స్పీడ్ అప్ లేదా స్లో డౌన్ చేసుకునే ఫీచ‌ర్ కూడా ఉంది.  

* రీల్స్ వీడియోను మీరు కావాలంటే డిలీట్ చేసుకోవ‌చ్చు. రివ్యూ చేసుకోవ‌చ్చు. రీ రికార్డ్ కూడా చేసుకోవ‌చ్చు.  

షేరింగ్ మీ ఇష్టం
ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో మీ పోస్టుల‌ను షేర్ చేసేట‌ప్పుడు ఫ్రెండ్స్ లేదా ప‌బ్లిక్ ఎవ‌రితో షేర్ చేసుకోవాలో ఆప్ష‌న్ ఉంది క‌దా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఇలా షేరింగ్‌కు ఆప్ష‌న్ ఉంది.  

జన రంజకమైన వార్తలు