• తాజా వార్తలు

షియోమి లాగే యాడ్స్‌తో విసిగిస్తున్న రియ‌ల్‌మి.. డిజేబుల్ చేయ‌డం ఎలా!

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

షియోమి ఫోన్లు త‌మ డిజైన్‌కు మంచి కెమెరాల‌కు, గేమింగ్ కెపాసిటీకి, అందుబాటు ధ‌ర‌కు బాగా ప్ర‌సిద్ధి. అయితే ఫీచ‌ర్ల‌లో ఎంత ఫేమ‌స్ అయిందో యాడ్ రిడిన్ ఎంఐయూఐతో షియోమి అంత‌గా చెడ్డ‌పేరు తెచ్చుకుంది.  ఇంట‌ర్‌ఫేస్‌లో యాడ్స్ బారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి చాలామంది షియోమి ఫోన్ల‌ను కొన‌డ‌మే మానేశారు. ఈ ఈ నేప‌థ్యంలో షియోమి బాటలో ఇప్పుడు రియ‌ల్ మి కూడా వ‌చ్చింది. యాడ్స్‌తో వినియోగ‌దారుల‌ను విసిగిస్తోంది. మ‌రి ఈ యాడ్స్‌ని డిజేబుల్ చేయ‌డం ఎలా!

ఇటీవ‌లే వ‌చ్చాయ్‌
రియ‌ల్‌మి ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఫోన్ల‌లో చాలావ‌ర‌కు యాడ్స్ ఉండ‌డం క‌ల‌వ‌ర‌ప‌రిచే అంశ‌మే. క‌ల‌ర్ ఓఎస్‌.6లో వ‌చ్చిన ఫీచ‌ర్ అప్‌డేట్‌లో క‌మ‌ర్షియ‌ల్ కంటెంట్ రిక‌మండేష‌న్ అనే మెసేజ్ ఉండ‌డం ఇందుకు ఊతం ఇస్తోంది. ఇలా మెసేజ్ ఉందంటేనే ఈ ఫోన్ యాప్‌ల‌కు యాడ్స్ ఇవ్వ‌డానికి, సైట్లు ప్ర‌చారం చేసుకోవ‌డానికి అనువుగా ఉంద‌నే అర్ధం. ఈ ఫోన్ల‌లో కొత్తగా ఫోన్ మేనేజ‌ర్‌, సెక్యూరిటీ చెక్ పేజీలు ఓపెన్ చేసిన‌ప్పుడు ఈ యాడ్స్ మనం చూడొచ్చు. అయితే యూజ‌ర్లు ఈ యాడ్స్‌ను డిజేబుల్ చేసుకునే అవ‌కాశం ఉండ‌డం ఉప‌శ‌మ‌న‌మే.

ఎలా డిజేబుల్ చేయాలి?
రియ‌ల్‌మి ఫోన్లో అద‌న‌పు సెట్టింగ్స్‌ని క్లిక్ చేయాలి. గెట్ రిక‌మండేష‌న్స్ మీద క్లిక్ చేయాలి. ఇందులో మీకు కొన్ని ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. అందులో ఉండే  రిసీవ్ యాప్ అండ్ కంటెంట్ రిక‌మండేష‌న్స్ ఇన్ సిస్ట‌మ్ యాప్స్ ఆప్ష‌న్ మీద ట్యాప్ చేయాలి. అయితే కొన్ని యాడ్స్ డిజేబుల్ కాక‌పోతే మ‌నం మాన్యువ‌ల్‌గా నిబంధ‌న‌లు ఫాలో అయి డిజేబుల్ చేసుకోవాలి. అయితే యూజ‌ర్ల‌ను ఇంత‌గా ఇబ్బందిపెట్టే యాడ్స్‌కు అనుకూలంగా రియ‌ల్‌మి ఎందుకు ఫోన్ల‌ను రూపొందిస్తుంది అనే ప్ర‌శ్న‌కు మాత్రం ఆ సంస్థ నుంచి ఎలాంటి స‌మాధానం లేదు.

జన రంజకమైన వార్తలు