• తాజా వార్తలు

జియో వాయిస్‌తో ఉచిత వాయిస్‌, వీడియో కాల్స్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

జియో.. భార‌త్‌లో ఎక్కువ‌గా ఉప‌యోగించే నెట్‌వ‌ర్క్‌ల‌లో ఒక‌టి. ఎయిర్‌టెల్‌, ఐడియా నుంచి పోటీ ఎదుర‌వుతున్నా జియో మాత్రం త‌గ్గ‌ట్లేదు. పోటీని తట్టుకుంటూ కొత్త ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. జియో వాయిస్  ఓవర్ వైఫై కాలింగ్ ఇందులో ఒక‌టి. వాయిస్ ఓవ‌ర్ వైఫై ఆప్ష‌న్ ద్వారా దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. మ‌రి జియో వాయిస్‌తో ఉచిత వాయిస్‌, వీడియో కాల్స్ ఎలా చేయాలో చూద్దామా..!

కొత్తగా వ‌చ్చింది..
ఇటీవ‌లే ఆకాశ్ అంబానీ సార‌థ్యంలోని రిల‌య‌న్స్ జియో వాయిస్ ఓవ‌ర్ వైఫై కాలింగ్ స‌ర్వీసును రోల్ ఔట్ చేసింది. ఇది అంద‌రు జియో క‌స్ట‌మ‌ర్ల‌కు వ‌ర్తిస్తుంది. ఈ ఫీచ‌ర్‌ని ఉప‌యోగించుకుని జియో క‌స్ట‌మ‌ర్లు ఉచితంగా వాయిస్, వీడియో కాలింగ్‌ను చేసుకోవ‌చ్చు.  అంతేకాక ఏ వైఫై నెట్‌వ‌ర్క్‌లోనైనా ఇది ప‌ని చేస్తుంది. కొన్ని నెల‌లుగా ఈ స‌ర్వీసును టెస్టు చేస్తున్నామ‌ని జియో చెప్పింది. ఇత‌ర నెట్‌వర్క్‌ల‌కు కాల్ చేసేట‌ప్పుడు వ‌ర్తించే ఐయూసీ, స‌ప‌రేట్ ఛార్జీలు వాయిస్ ఓవ‌ర్ వైఫై కాలింగ్ స‌ర్వీస్‌కు వ‌ర్తించ‌వు.  ఈ స‌ర్వీస్ యాక్టివేట్ అయిన త‌ర్వాత  యూజ‌ర్లు వోఎల్ టీఈ నుంచి వైఫైకి మారిపోవ‌చ్చు. ఎక్క‌డ నెట్‌వ‌ర్క్ క‌వ‌రేజ్ త‌క్కువ‌గా ఉన్నా ఈ వైఫై ద్వారా మ‌నం ఇంట‌ర్నెట్ సేవ‌లు పొందొచ్చు. 

యాక్టివేట్ చేసుకోవ‌డం ఎలా?
మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వైఫై కాలింగ్ స‌ర్వీస్ ఆప్ష‌న్ వెత‌కాలి.  అనేబుల్ ద స్విచ్ టు యాక్టివేట్ స‌ర్వీస్ ఆప్ష‌న్ ట్యాప్ చేయాలి.  ఒక‌వేళ మీకు వైఫై కాలింగ్ స‌ర్వీస్ అనే ఆప్ష‌న్ క‌నిపించ‌క‌పోతే మీ స్మార్ట్‌ఫోన్ ఈ స‌ర్వీస్‌కు స‌పోర్ట్ చేయ‌డం లేద‌ని అర్థం. ప్ర‌స్తుతం కేర‌ళ‌, మ‌హారాష్ట్ర, కోల్‌క‌తాల్లో ఈ స‌ర్వీస్ టెస్టింగ్ ప‌ర్ప‌స్ యాక్టివేట్ అయింది. దీన్ని జ‌న‌వ‌రి 7 నుంచి 16 వ‌ర‌కు టెస్టింగ్ ప‌ర్ప‌స్ మీద రిలీజ్ చేస్తున్నారు.  

జన రంజకమైన వార్తలు