• తాజా వార్తలు

ఎలాంటి సాఫ్ట్ వేర్ లోడ్ చేయకుండానే పీడీఎఫ్ ఫైళ్లు చూడడం ఎలా?

  • - ఎలా? /
  • 7 సంవత్సరాల క్రితం /



పీడీఎఫ్ డాక్యుమెంట్లను కంప్యూటర్లో చూడాలంటే అడోబ్ రీడర్ సాఫ్ట్ వేర్ కానీ, ఇతర పీడీఎఫ్ రీడర్లు కానీ ఉండాలని అనుకుంటారు అంతా. కానీ... అలాంటి అవసరం లేకుండానే పీడీఎఫ్ ఫైల్ ను చదువుకునే వీలుంది. అదెలాగో తెలుసా..?

* జీమెయిల్ సహాయంతో..
మీ సిస్టమ్ లోని పీడీఎఫ్ ఫైల్ ను మీ జీమెయిల్ అకౌంట్ కు సెండ్ చేసుకోండి. ఇప్పుడు మెయిల్ లో ఓపెన్ చేసి ‘‘వ్యూ యాజ్ హెటీఎంఎల్’’ ఆప్షన్ క్లిక్ చేయండి. అంతే.. ఇంటర్నెట్ లో ఓపెన్ అవుతుంది.

* పీడీఎఫ్ ఎస్కేప్
ఇది పీడీఎఫ్ రీడర్లకు వెబ్ వెర్షన్ అనుకోవచ్చు. ఇది కేవలం పీడీఎఫ్ ఫైళ్లను ఓపెన్ చేయడమే కాదు.. అందులో ఎడిట్ చేయడానికి కూడా అవకాశమిస్తుంది.

* స్లైడ్ షేర్
upload@upload.slideshare.net అనే మెయిల్ చిరునామాకు మనం చూడాల్సిన పీడీఎఫ్ పైల్ సెండ్ చేయాలి. స్లైడ్ షేర్ లోని పీడీఎఫ్ కన్వర్షన్ ఇంజిన్ దాన్ని ఇమేజి స్లైడ్లుగా మార్చేస్తుంది.

* జోహో వ్యూయర్
ఇది కూడా స్లైడ్ షేర్ లాగే పనిచేస్తుంది. కంప్యూటర్ నుంచి జోహో వ్యూయర్ లోకి పీడీఎఫ్ ఫైల్లు అప్ లోడ్ చేయాలి. అక్కడ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఇతర వెబ్ సైట్లలో ఉన్న పీడీఎఫ్ లైతే ఆ లింక్ ను జోహో వ్యూయర్ లో పేస్ట్ చేసి ఓపెన్ చేయాలి.

* సమురాజ్ డాటా
ఇది కూడా జోహో వ్యూయర్ మాదిరిగానే పనిచేస్తుంది.

జన రంజకమైన వార్తలు