ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ అంటే ఈపీఎఫ్ ఖాతాలో ఉండే నిల్వ. మీ వేతనంలో నుంచి నెలవారీగా మినహాయించే డబ్బుతోపాటు కంపెనీ జమచేసేదంతా మీ పీఎఫ్ అకౌంట్లో ఉంటుంది. ఈ పీఎఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా ఎంత డబ్బు పొదుపు అవుతుందనేది తెలుసుకోవచ్చు. ఇపిఎఫ్ఓ ద్వారా మీకు కేటాయించిన నెంబర్ ను మీరు ఎక్కడినుంచైనా పీఎఫ్ చేసుకోవచ్చు. uanఅనేది మీ ఈపీఎఫ్ ను ట్రాక్ చేయడానికి సహాయపడే నెంబర్. మీ యుఏఎన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ ఫాలో అవ్వండి.
నా UAN ఏంటి- ఎలా తెలుసుకోవాలి....
1.EPFO మెంబర్ సర్వీసు పోర్టల్ కు వెళ్లండి.
2. కింద కుడివైపున మీ UAN స్టేటస్ తెలుసుకోని క్లిక్ చేయండి.
3. మీ UAN తెలుసుకోవడానికి ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ ఉంటాయి.
4. మీ పిఎఫ్ సభ్యుడి ఐడి, ఆధార్ కార్డు లేదా పాన్ ద్వారా UANను తెలుసుకోవచ్చు.
5. ఈ మూడింటిలో ఏదైనా ఒకటి సెలక్ట్ చేసుకోండి.
6.ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ అడ్రెస్ తోపాటు పేజీలో రిజిస్టర్ అయిన వివరాను ఎంటర్ చేయండి.
7.అధికారిక పిన్ పొందిన తర్వాత క్లిక్ చేయండి.
8 తర్వాత పేజీలో నేను అంగీకరిస్తున్నాను అని ఉన్న బాక్స్ ను క్లిక్ చేయండి.
9.ఇప్పుడు EPFOనుంచి ఒక మెసేజ్ మీఫోన్ కు వస్తుంది.
10.ఒక OTPవస్తుంది.
11.ఇప్పుడుOTPని ఎంటర్ చేసి క్లిక్ చేయండి.
12. ఇప్పుడు UANని ఉన్న EPFOనుంచి మెసేజ్ కోసం మీ ఫోన్ను ఓసారి చెక్ చేయండి.