• తాజా వార్తలు

వాట్స‌ప్ గ్రూప్ వాయిస్,వీడియో కాల్స్ చేసుకోవ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

వాట్స‌ప్‌... ప్ర‌పంచంలో కోట్లాది మంది ఉప‌యోగించే మెసేజింగ్ యాప్‌. దీనిలో కేవ‌లం మెసేజ్‌లు మాత్ర‌మే చేసుకోవ‌చ్చా.. కాదు చాలా చాలా ఫీచ‌ర్లు ఉన్నాయి. ఫొటోలు పంపుకోవ‌డం, ఫైల్స్‌, వీడియోలు షేర్ చేసుకోవ‌డం లాంటి ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అయితే వీట‌న్నిటికి మించి ఉన్న ఉప‌యోగం కాల్స్ చేయ‌డం.. అవ‌త‌లి వ్య‌క్తికి వాట్స‌ప్ ఉంటే చాలు కాల్స్ చేసే అవ‌కాశం ఉంటుంది. అయితే మ‌న‌కు ప‌ర్స‌న్‌కు మాత్ర‌మే కాల్ చేయ‌డం తెలుసు. మ‌రి గ్రూప్‌కి కాల్ చేయాలంటే ఎలా? ..దీనికి వాట్స‌ప్‌లో ఛాన్స్ ఉంది అదెంటో చూద్దామా..

ఏమిటీ గ్రూప్ కాలింగ్‌?
ఒకేసారి ఒక‌రికంటే ఎక్కువ‌మంది కాల్స్ చేసే అవ‌కాశాన్ని కల్పించేదే గ్రూప్ కాలింగ్‌. వాట్స‌ప్‌లో ఉన్న ఈ ఫీచ‌ర్ చాలా ఉప‌యోగ‌క‌రం. ఎందుకంటే బ‌య‌ట వాయిస్ కాల్స్ లేదా కాల్స్ ఛార్జ్‌ల‌తో పోలిస్తే దీనిలో ఉచితంగా కాల్స్ చేసుకోవ‌చ్చు. కేవ‌లం సింగిల్ టు సింగిల్ కాల్స్ మాత్ర‌మే కాదు గ్రూప్ వాయిస్ కాల్స్‌, వీడియో కాల్స్ కూడా చేసుకునే వీలుంటుంది.  దీనిలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ఉండడం వ‌ల్ల మన వాయిస్ ఎవ‌రో ఒక‌రు వింటార‌ని... మ‌న వీడియోల‌ను వేరేవాళ్లు చూస్తార‌నే భ‌యం అవ‌స‌రం లేదు. అందు కోసం మీరు ఇబ్బంది లేకుండా ఈ కాల్స్ చేసుకోవ‌చ్చు.

ఏం చేయాలంటే..
వాట్స‌ప్ వాయిస్‌, వీడియో కాల్స్ చేయాలంటే ముందుగా మీరు వాట్స‌ప్ ఓపెన్ చేసి మీరు ఎవ‌రికైతే కాల్స్ చేయాల‌నుకుంటున్నారో వారి కాంటాక్ట్ మీద క్లిక్ చేసి కాల్ మీద ట్యాప్ చేయాలి. మీరు ఒక‌రికి మించి కాల్ చేయాల‌నుకుంటే కాంటాక్ట్‌లోకి వెళ్లి డాట్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంకో కాంటాక్ట్ సెల‌క్ట్ చేసుకోవ‌చ్చు. ఇలా ఎంత‌మందినైనా కాల్‌కి యాడ్ చేసుకుంటూపోవ‌చ్చు. ఇలా చేయ‌డం ద్వారా ఒకేసారి ఎక్కుమంది వాయిస్ కాల్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు