• తాజా వార్తలు

ఓటర్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఆన్ లైన్ లో చెక్ చేయడం ఎలా ?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మన దేశం లో 18 సంవత్సరలవయసు నిండిన ప్రతీ ఒక్కరికీ రాజ్యాంగo ఓటు హక్కును కల్పించింది అనే విషయం మనలో చాలా మందికి తెలిసినదే. కొత్తగా ఓటు హక్కు పొందుటకు ఆన్ లైన్ లో ఎలా అప్లయ్ చేసుకోవాలి అనే అంశం గురించి గత ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు ఆన్ లైన్ లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేశారా? ఫారం 6 ను ఆన్ లైన్ లో సబ్మిట్ చేశారా? అయితే మీ అప్లికేషను ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. ఆన్ లైన్ లో ఫారం 6 ద్వారా కొత్త ఓటర్ కార్డు కోసం అప్లై చేసిన తర్వాత మీ దరఖాస్తు అంగీకరించబడినదా? లేదా? ఉంటే ఏ స్థితిలో ఉంది? తదితర విషయాలను ఆన్ లైన్ లోనే తెలుసుకోవచ్చు. అదెలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

వోటర్ ఐడి అప్లికేషను స్టేటస్ ను ఆన్ లైన్ లో చెక్ చేసుకోవడం ఎలా?

  1. నేషనల్ వోటర్ సర్వీస్ పోర్టల్ ను బ్రౌజ్ చేయండి. ఆ పేజి ఓపెన్ అయిన తర్వాత అక్కడ ట్రాక్ అప్లికేషను స్టేటస్ అనే ఐకాన్ దగ్గరకు ఆ పేజి ని స్క్రోల్ చేయండి. అక్కడ కనిపించే క్లిక్ హియర్ అనే దానిపై క్లిక్ చేయండి. లేదా డైరెక్ట్ గా NVSPonlineapplicationstatus పేజి కి వెళ్ళవచ్చు.
  2. ఇప్పుడు మీ ఓటర్ ఐడి అప్లికేషను యొక్క రిఫరెన్స్ ఐడి ని ఎంటర్ చేయండి. ఇది మీరు అప్లై చేసినపుడు వచ్చే ప్రింట్ అవుట్ మీద పై భాగం లో ఉంటుంది. లేదా మీ ఫోన్ నెంబర్ లో sms రూపం లో గానీ ఈమెయిలు లో గానీ ఉంటుంది.
  3. దానిని ఎంటర్ చేసిన వెంటనే మీ అప్లికేషను యొక్క స్టేటస్ మీకు తెలిసిపోతుంది.
  4. సాధారణంగా ఏ అప్లికేషను కైనా నాలుగు స్టేటస్ లు ఉంటాయి. అవి సబ్మిటేడ్, BLO అప్పాయింటేడ్, ఫీల్డ్ వెరిఫైడ్, మరియు యాక్సెప్ట్/రిజేక్టేడ్ . ఈ నాలుగు ప్రక్రియలలో పూర్తి అయిన ప్రక్రియలు హైలెట్ చేసి కనపడతాయి. పూర్తి అవనివి డల్ గా కనిపిస్తాయి. దానినిబట్టి మీ అప్లికేషను ఏ స్టేటస్ లో ఉందో తెలుసుకోవచ్చు.
  5. మీరు కేవలం ఆన్ లైన్ లో అప్లై చేసినపుడు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

sms ద్వారా కూడా తెలుసుకోవచ్చా?

లేదు. ఓటర్ ఐడి యొక్క స్టేటస్ ను sms ద్వారా కూడా తెలుసుకునే విధానం దేశం లోని కొన్ని రాష్ట్రాలలో మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా మీ పేరు ఓటర్ లిస్టు లో ఉందొ లేదో మాత్రమే తెలుస్తుంది. అంతే కానీ అప్లికేషను యొక్క స్టేటస్ sms ద్వారా తెలుసుకోవడం కుదరదు. ఓటర్ కార్డు కు సంబందించిన మరిన్ని అప్ డేట్ లను ఎప్పటికప్పుడు మీకు మా కంప్యూటర్ విజ్ఞానం అందిస్తూనే ఉంటుంది.  

జన రంజకమైన వార్తలు