మన ఫోన్‌లోని సమాచారం, ఫొటోలు, పీడీఎఫ్ ఫైల్స్, ఇలా ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకుని దాచుకునేందుకు అందరూ ఉపయోగించేది గూగుల్ డ్రైవ్!! ఇందులో కొన్నింటిని మనం షేర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ గూగుల్ డ్రైవ్‌లో ఉన్న చాలా ఫైల్స్ మనకి తెలియకుండానే పబ్లిక్ అయిపోయి ఉంటాయి. ఇందులో కొన్ని చాలా ముఖ్యమైనవి కూడా ఉండి ఉండొచ్చు. మరి ఇలా పబ్లిక్ అయిన వాటిని ఎలా తెలుసుకోవాలి? వాటికి ఉన్న పబ్లిక్ యాక్సెస్‌ని ఎలా డిజేబుల్ చేయాలి? వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం!
పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ లిస్ట్
కావాలనో లేదా అకస్మాత్తుగానో గూగుల్ డ్రైవ్ ఉన్న ఫైల్స్‌కి పబ్లిక్ యాక్సెస్ ఇస్తాం. తర్వాత వీటికి ఆ యాక్సెస్ తీసేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఇటువంటి సమయంలో గూగుల్ డ్రైవ్‌లో పబ్లిక్ యాక్సెస్‌బుల్‌గా ఉన్న ఫైల్స్‌ని తెలుసుకునేందుకు Filewatch అనే సర్వీస్ ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఈ సర్వీస్ వినియోగిస్తే.. మనకి ఒక లిస్ట్ కనిపిస్తుంది. ఇందులో గూగుల్ డ్రైవ్‌లో పబ్లిక్ యాక్సెస్ ఉన్నఫైల్స్ కనిపిస్తాయి. ఇందులోని ప్రతి ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు. అంతేగాక వాటికి ఉన్న యాక్సెస్ పర్మిషన్ మార్చుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే.. ఈ వెబ్‌సైట్ ఎలాంటి సమాచారాన్ని సేవ్ చేయదు.
దీనిని ఉపయోగించడమెలా?
* Filewatch సర్వీస్ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి.
* Connect service బటన్ కనిపిస్తుంది. దీనిని ఉపయోగించి గూగుల్ డ్రైవ్ అకౌంట్‌లోకి సైన్ ఇన్ అవ్వాలి. మన అకౌంట్‌ని యాక్సెస్ చేసే అనుమతి ఇవ్వాలి. దీని వల్ల మరింత మెరుగైన ఫలితం వస్తుంది.
* Find now ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. పబ్లిక్‌కి షేర్ అయిన ఫైల్స్ లిస్ట్ కనిపిస్తుంది.
* ప్రతి ఫైల్ నేమ్‌కి చివర ఆ ఫైల్ ఎక్సటెన్షన్ ఉంటుంది. దీంతో పాటు ఫైల్ ఓనర్ కూడా తెలియజేస్తుంది.
* ఫైల్ పక్కన `ఓపెన్ ఫైల్ ఇన్ న్యూ ట్యాబ్` అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి.
* తర్వాత ఏదైనా ఫైల్‌ని ఓపెన్ చేసి Share ఆప్షన్ ద్వారా.. ఫైల్ యాక్సెస్‌ని మార్చుకోవచ్చు.