మన దేశం లో ప్రతీ చిన్న విషయానికీ ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరి అయింది. తప్పనిసరి అనేకంటే మన జీవితం లో ఒక భాగం అయింది అంటే బాగుంటుందేమో! బ్యాంకు ఎకౌంటు ల నుండీ పాన్ కార్డు ల వరకూ, ఇన్సూరెన్స్ పాలసీ ల దగ్గరనుండీ మొబైల్ నెంబర్ ల వరకూ, స్థిర చరాస్తుల కొనుగోల్ల లోనూ ఇలా ఇంకా అనేక విషయాలలో ఆధార్ కార్డు తప్పనిసరి అయింది.మరి ఇంతలా మన జీవితాలలో పెనవేసుకోపోయిన ఆధార్ కార్డు ను సెక్యూర్ గా ఉంచుకోవలసిన బాద్యత మనపై ఉందా? లేదా? మన ఆధార్ కార్డు ను సెక్యూర్ గా ఉంచుకోవడం అంటే మన బయో మెట్రిక్ లను లాక్ చేయడమే. మొట్టమొదటిగా మనం ఆధార్ కార్డు తీసుకునేటపుడు మన రెండు చేతుల వేలిముద్రలు అలాగే కంటి యందలి ఐరిష్ లను స్కాన్ చేస్తారు. వీటినే బయో మెట్రిక్ లంటారు. ఈ సంగతి మనకు తెలిసినదే. అయితే ఈ బయో మెట్రిక్ లను కూడా లాక్ చేసుకునే వెసులుబాటును UIDAI కల్పించింది. మీ ఆధార్ వివరాలు దుర్వినియోగం అవకుండా మీ బయో మెట్రిక్ లను మీరే లాక్ చేసుకోవచ్చు మరియు అన్ లాక్ కూడా చేసుకోవచ్చు. ఈ వివరాలతో కూడిన ఆర్టికల్ ను ఇంతకూ ముందే మన వెబ్ సైట్ లో ప్రచురించడం జరిగింది. తాజా మార్పులు, అప్ డేట్ ల తో మరొక్క సారి మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం దీనిని అందిస్తున్నాం.
గమనిక : ఆధార్ లోని బయో మెట్రిక్ లను లాక్/అన్ లాక్ చేయాలి అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ తో లింక్ అవ్వకపోతే మీకు దగ్గరలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లి వెంటనే రిజిస్టర్ చేయించుకోండి.