• తాజా వార్తలు

ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా పేటీఎమ్ నుండి మనీ పంపుకోవడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

కొన్ని నెలల క్రితం వరకు కేవలం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన Paytm సేవలు, ఇప్పుడు బేసిక్ మొబైల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసాయి.ఈ నేపథ్యంలో నగదు బదిలీని మరింత సులభతరం చేస్తూ పేటీఎమ్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇప్పుడు ఇంటర్నెట్‌తో పనిలేకుండా Paytm ద్వారా డబ్బులు పంపుకోవచ్చు. ఇందుకు ఏ విధమైన మెసేజ్‌లను కూడా పంపాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్‌తో పనిలేకుండా బేసిక్ మొబైల్ ఫోన్ నుంచి సైతం నగదు బదిలీ చేసుకునే విధంగా సరిరికొత్త కాన్సెప్ట్‌ను Paytm అందుబాటులోకి తీసుకువచ్చింది. 

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్న వారు తొలత తమ పేరిట ఓ Paytm అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవల్సి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్నస్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా Paytm అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు. మీ పేరిట Paytm అకౌంట్‌ క్రియేట్ అయిన వెంటనే credit/debit లేదా నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించుకుని మీ పేటీఎమ్ వాలెట్‌లోకి నగదును యాడ్ చేసుకోండి.

డబ్బు మీ అకౌంట్‌లో యాడ్ అయిన తరువాత Paytm సర్వీసులను ఉపయోగించుకుంటోన్నఏ మొబైల్ నెంబర్‌కైనా ఇంటర్నెట్ కనెక్షన్‌తో పనిలేకుండా నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది. ఇందుకుగాను 1800-1800-1234 నెంబర్‌కు కాల్ చేయవల్సి ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ను ఉపయగించుకోవటం ద్వారా యాప్‌లోకి వెళ్లకుండానే నగదు చెల్లింపులను చేపట్టవచ్చు.

ఈ సర్వీసుకు సంబంధించిన బెనిఫిట్లను పొందే క్రమంలో యూజర్లు ముందుగా తమ మొబైల్ నెంబర్లతో పాటు 4 డిజిట్ల Paytm PINతో పేటీఎమ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత 1800-1800-1234 నెంబర్‌కు కాల్ చేసి మీరు నగదు పంపాలనుకుంటున్న వ్యక్తి మొబైల్ నెంబర్ అలానే అతని Paytm PIN వివరాలను తెలపటం ద్వారా నగదును ట్రాన్స్‌ఫర్ చేసే వీలుంటుంది. ఈ ప్రక్రియలో సెండర్‌కు సంబంధించి పేటీఎమ్ వాలెట్‌లోని నగదును రిసిప్టెంట్ పేటీఎమ్ వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయటం జరుగుతుంది.

జన రంజకమైన వార్తలు