• తాజా వార్తలు

ఇప్పటికీ విండోస్ 10 ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ?

  • - ఎలా? /
  • 5 సంవత్సరాల క్రితం /

మైక్రోసాప్ట్ విండోస్ 10 రిలీజ్ చేయగానే దాన్ని అందరూ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటూ గడువు తేదీ ఇచ్చింది. ఆ తేదీ గతేడాది జూలై 29తోనే అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా విండోస్ 10ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కొంతమొత్తం పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉచితంగా విండోస్ 10ని  అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీరు విండోస్ 10ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ విండోస్ పేజిని ఓపెన్ చేస్తే అందులో మీకు డౌన్‌లోడ్ ఆప్సన్ కనిపిస్తుంది. అక్కడ కనిపించే లింక్ మీద క్లిక్ చేయండి.
లింక్ ఇదే : https://www.microsoft.com/en-in/software-download/windows10
అక్కడ కనిపించే డౌన్‌లోడ్ ఆప్సన్ మీద క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ పూర్తి అయినవెంటనే దాన్ని ఓపెన్ చేయండి. అక్కడ మీకు కండీషన్స్ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది.
అది క్లిక్ చేయగానే మీకు అప్‌గ్రేడ్ పీసీ నౌ అనే బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే విండోస్ 10 డౌన్ లోడ్ అవుతుంది. అయితే ఇది కొంత సమయం తీసుకుంటుంది.
డౌన్‌లోడ్ సమయంలో మీకు పర్సంటేజ్ కనిపిస్తుంది. అది పూర్తిగా డౌన్‌లోడ్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటుంది. అయిపోయిన తరువాత దాన్ని ఇన్ స్టాల్ చేసే సమయంలో మళ్లీ లైసెన్స్ టర్మ్ కండీషన్స్ అడుగుతుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి.
అది పూర్తిగా ఇన్ స్టాల్ అయిన తరువాత మీ సిస్టంను ఓ సారి రీస్టార్ట్ చేయండి. అప్పుడు మీకు విండోస్ 10కు ఫీచర్స్ కనిపిస్తాయి. మీరు విండోస్ 10 అప్ గ్రేడ్ కావడానికి దాదాపు 1 గంటకు పైగానే సమయం తీసుకుంటుంది. అది ఇంటర్నెట్ చాలా ఫాస్ట్ గా ఉంటే మీ పని తొందరగా అవుతుంది. లేకుంటే మరింత సమయం తీసుకుంటుంది.

జన రంజకమైన వార్తలు