సైబర్ మోసగాళ్లు రోజురోజుకీ హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి కస్టమర్ల అకౌంట్స్ నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్డులేకుండా (కార్డ్ లెస్) డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఎస్బీఐ యోనో కార్డు ద్వారా యోనో యాప్ సహాయంతో పరిమిత నగదు ఉపసంహరణ విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే ఇది ఇష్టం లేని వారు నేరుగా ఏటీఎం కార్డు ద్వారా కూడా డ్రా చేసుకోవచ్చు.
యోనో ప్లాట్ ఫాం ద్వారా క్యాష్ విత్ డ్రా ఎలా చేయాలి?
ముందుగా యోనో యాప్/పోర్టల్‌లోకి లాగిన్ అవండి. అక్కడ కనిపించే యోనో క్యాష్ ఆఫ్షన్ ఎంచుకోండి. తర్వాత క్విక్ లింక్స్ YONO Payలో YONO Cash ఎంచుకోండి. అప్పుడు మీకు యోనో క్యాష్ లాండింగ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపించే Nearest YONO cash Points క్లిక్ చేయండి. తద్వారా మీరు దగ్గరలోని మీ యోనో క్యాష్ పాయింట్స్‌ను తెలుసుకోవచ్చు.
ఇప్పుడు క్యాష్ విత్ డ్రా కోసం Request YONO Cash ను సెలక్ట్ చేసుకోండి. ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మొదట మీ బ్యాంకు అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అలాగే మీరు ఎంత విత్ డ్రా చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఓ ట్రాన్సాక్షన్‌కు రూ.10,000, రోజుకు గరిష్టంగా రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఏటీఎంను డెలివరీ చానల్‌గా సెలక్ట్ చేసుకోండి. తర్వాత పేజీలో యోనో క్యాష్ పిన్ క్రియేట్ చేయండి. మీ డివైజ్ పైన మాత్రమే పిన్ నెంబర్ కనిపిస్తుంది. మళ్లీ ఓ సారి మీ ట్రాన్సాక్షన్స్ వివరాలను సమీక్షించుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించిన తర్వాత Confirm బటన్ పైన క్లిక్ చేయండి.
ఇప్పుడ మీకు దగ్గర్లోని యోనో క్యాష్ పాయింట్‌ను క్లిక్ చేయడం ద్వారా క్యాష్ విత్ డ్రా కోసం మీకు దగ్గరలోని యోనో క్యాష్ పాయింట్‌ను సెర్చ్ చేయండి. అక్కడ కనిపించే యోనో క్యాష్ పాయింటును సెలక్ట్ చేసుకోండి. ఆ సెంటర్ కి వెళ్లి యోనో క్యాష్ ఫంక్షన్ కలిగిన ఎస్బీఐ ఏటీఎం నుంచి మీకు వచ్చిన పిన్ ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.