ఐపాడ్.. మ్యూజిక్ లవర్స్ ఒకప్పుడు ఇదంటే పడిచచ్చిపోయేవారు. అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నసైజుల్ ఉండే ఈ డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్లు ఒకప్పుడు చాలా హల్‌చల్ చేశాయి. పెద్ద పెద్ద ఇనిస్టిట్యూషన్స్‌లో చదువుకునే స్టూడెంట్స్ వీటిలో సాంగ్స్ స్టోర్ చేసుకుని మ్యూజిక్ వింటూ కాలేజ్ క్యాంపస్‌ల్లో సందడి చేసేవారు. కానీ మారుతున్న టెక్నాలజీతో పాటు వీటికీ ముప్పు వచ్చింది. టేప్‌రికార్డర్ల మూలనపడినట్లే డిజిటల్ మ్యూజికల్ ప్లేయర్లకు కూడా కాలం చెల్లిపోతోంది. యాపిల్ కూడా తన ఐపాడ్ నానో, ఐపాడ్ షఫుల్‌ల కథ ముగించేస్తోంది. కేవలం టచ్ వెర్షన్లు ఉన్న రెండు ఐపాడ్ వేరియంట్లు మాత్రమే ఇక మార్కెట్‌లో ఉంటాయని యాపిల్ చెప్పింది.
2005లో రిలీజ్
ఐపాడ్ షఫుల్, ఐపాడ్ నానోలు 2005లో రిలీజయ్యాయి. ఐఫోన్ 2007లో మార్కెట్‌లోకి వచ్చేవరకు ఐపాడ్‌లు టెక్ లవర్స్‌న బాగానే అలరించాయి. అయితే స్మార్ట్‌ఫోన్ల రాకతో మ్యూజిక్ ప్లేయర్ల అవసరం తగ్గిపోయింది. యాపిల్ ప్రొడక్ట్‌లు అన్నింటి కంటే బాగా పాపులర్ అయిన ఐ ఫోన్ వచ్చాక సెపరేట్‌గా మ్యూజిక్ ప్లేయర్ల అవసరం లేకపోయింది. దీంతో ఐపాడ్‌లకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. యాపిల్ కూడా ఈ విషయాన్ని గ్రహించి టచ్ ఫీచర్‌తో ఉన్న ఐపాడ్‌లపై దృష్టి పెట్టింది. ఈ వరుసలో ఇప్పుడు ఐపాడ్ షఫుల్, ఐపాడ్ నానోలను డిస్‌కంటిన్యూ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఐపాడ్ టచ్ ఒక్కటే మిగిలింది..
ప్రస్తుతం ఐపాడ్ టచ్ ఒక్కటే మార్కెట్లో మిగిలింది. దీనికి స్టోరేజ్ కెపాసిటీని యాపిల్ డబుల్ చేసింది. ఇంతకముందు 16 జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండేవి. ఇప్పుడు వాటిని 32 జీబీ, 128 జీబీకి పెంచింది.