రోడ్డు మీద నడిచే సమయంలో స్మార్ట్ ఫోన్ వాడితే ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా చాలామంది ఆ వ్యసనాన్ని వదులుకోరు. రోడ్డు మీద ఏం వెళుతున్నా వారు ఫోన్లో లీనమయి పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం ఏదైనా రోడ్డు ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఇలాంటి వారి కోసం చైనాలో కొన్ని చోట్ల రోడ్లను ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులేశారు. ఈ రోడ్డు ఫోన్ చూసుకుంటూ నడిచేవారికోసమే అని స్పష్టంగా తెలిసేలా స్మార్ట్ ఫోన్ బొమ్మలు కూడా గీశారు.
ఒక్కోసారి కొందరు ఫుట్‌పాత్‌పైనే వాహనాలు నిలుపుతుంటారు. ఫోన్లతో బిజీగా ఉంటూ చూసుకోకుండా వాహనాలను ఢీకొడుతుంటారు. ఇలాంటివన్నీ నివారించేందుకే నెల రోజులుగా ఓ కొత్త రోడ్డును ఏర్పాటు చేయమని కోరుతున్నామని, దానికి అధికారులు స్పందించి ఈ ఏర్పాటు చేశారని అక్కడి అధికారులు చెబుతున్నారు. 100 అడుగుల వరకు సెల్ ఫోన్ యూజర్ల కోసం దారిని ఏర్పరచారు. ప్రపంచంలో కెల్లా ఇదే ఫస్ట్ మొబైల్ వాకింగ్ రోడ్ అక్కడి అధికారులు చెబుతున్నారు.
Chongqing phone lane దారి కాపీ కొట్టారని ఇది వరకే Washington DCలోని 18th Streetలో ఈ రోడ్డు ఉందని మరికొందరు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే 2012లోనే Philadelphia నగరం e-lane పేరుతో smartphone users కోసం రోడ్డును ప్రకటించింది. అయిది అది ఏప్రిల్ పూల్ అంటూ ప్రకటించడంతో చాలామంది దానిపై దుమ్మెత్తిపోశారు. ఏదైమైనా స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ఇలా ప్రత్యేకంగా రోడ్డు వేయడమనేది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే మరి.