• తాజా వార్తలు

ఈ రోజు వ‌రల్డ్ పాస్‌వ‌ర్డ్ డే.. 100 వ‌ర‌స్ట్ పాస్‌వ‌ర్డ్‌లు ఇవేన‌ట‌!

డిజిట‌ల్ యుగంలో మ‌న ప్ర‌తి అకౌంట్‌కు పాస్‌వ‌ర్డే తాళం చెవి. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ నుంచి ఫేస్‌బుక్ అకౌంట్ వ‌ర‌కు పాస్వ‌ర్డ్ లేనిదే న‌డ‌వదు. నాలుగంకెల పాస్‌వ‌ర్డ్ చెబితేగానీ మీ అకౌంట్లో ఎంత డ‌బ్బున్నా ఏటీఎం ఒక్క పైసా కూడా రాల్చ‌దు. ఈమెయిల్‌, ఈకామ‌ర్స్ ఇలా ఏ అకౌంట్ ఓపెన్ చేయాల‌న్నా స‌రైన తాళం చెవి అదేనండీ పాస్‌వ‌ర్డ్ పెట్టాల్సిందే. ఈ రోజు (మే 7) ప్ర‌పంచ పాస్‌వ‌ర్డ్ దినోత్సవం. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచంలోని సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు అత్యంత వ‌ర‌స్ట్ పాస్‌వ‌ర్డ్‌ల లిస్ట్ బ‌య‌ట‌పెట్టారు. నోర్డ్‌పాస్ అనే సంస్థ రిపోర్ట్ ప్ర‌కారం అందులో మ‌చ్చుకు కొన్ని.

వ‌రుస అంకెలు పెట్ట‌డం
123, 1234, 12345, 123456, 123123,143143, 

ఒకే అంకెను ప‌దేప‌దే రాయడం
555555, 666666, 00000, 000000,111111, 222222,

అంకెలు తిర‌గేయడం
123321, 654321, 

ఆట‌ల‌పేర్లు 
cricket, hockey, soccer,baseball, basketball

తినుబండారాల పేర్లు
pepper, ginger, jelly, choclet,cookie, shopping, maggie

ఫేమ‌స్ పేర్లు
Dubsmash, tiktok, facebook, whatsapp, 

ముద్దు పేర్లు
Test, qwerty, iloveyou, princess, sweety, monkey, 

ఎక్కువ‌మందికి ఉండే పేర్లు
jennifer, jock, amanda, jordan, jessica, nicoel, michael, charley

స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్ ఎలా ఉండాలి?
తెలిసిందిగా.. కాస్త అటూఇటూగా మ‌నం కూడా చాలామంది ఇలాంటి ఈజీ పాస్‌వ‌ర్డ్‌లు పెడుతుంటాం. ఇలాంటి వాటిని హ్యాక‌ర్లు 
చాలా ఈజీగా పట్టేస్తార‌ట‌. అందుక‌ని మీ పాస్‌వ‌ర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. దానికి ఏం చేయాలి? ఏం చేయ‌కూడదంటే.. 

పాస్‌వ‌ర్డ్‌గా ఇవి వ‌ద్దు
* మీది, మీ కుటుంబ‌స‌భ్య‌ల పేర్లు
* మీది, మీ కుటుంబ‌స‌భ్యుల డేట్ ఆఫ్ బ‌ర్త్‌లు
* ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రిగిన తేదీలు, సంవ‌త్స‌రాలు అంటే ప‌దో త‌ర‌గ‌తి పాస‌యిన ఇయ‌ర్‌, పెళ్లిరోజు, ఉద్యోగంలో చేరిన సంవ‌త్స‌రం, మీ ఆఫీస్ పేరు, డిజిగ్నేష‌న్ ఇలాంటి వాటిని పాస్‌వ‌ర్డ్‌గా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పెట్టొద్దు.
* ఎందుకంటే సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఇవ‌న్నీ అంద‌రికీ తెలిసిపోతున్నాయి. కాబ‌ట్టి అవేమీ వ‌ద్దు. పైన చెప్పిన‌ట్లు గెస్ చేయ‌డానికి వీల‌య్యే అంకెలు, పేర్లు, అక్ష‌రాలు అస‌లే వ‌ద్దు 

స్ట్రాంగ్ పాస్‌వ‌ర్డ్ ఎలా ఉండాలంటే?
* సాధ్య‌మైనంత ఎక్కువ సంక్లిష్టంగా ఉండాలి.
* అక్ష‌రాలు, అంకెలు, స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ల‌ను ఎక్కువ వాడి గెస్ చేయ‌డానికి క‌ష్టంగా ఉండే పాస్‌వ‌ర్డ్ పెట్టుకోండి
* అలాగని మరీ మీరే మ‌ర్చిపోయేలాంటి పాస్‌వ‌ర్డ్‌లు పెట్టుకుంటే మీకు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతుంది.


 

జన రంజకమైన వార్తలు