చైనా దిగ్గజం షియోమీ కంపెనీ బ్రాండ్ Huami ఇండియా మార్కెట్లో సరికొత్త కొత్త స్మార్ట్ వాచీని విడుదల చేసింది. హుయామి అమెజ్ ఫిట్ బిప్ లైట్ (Amazfit Bip Lite)అనే పేరుతో ఇది లాంచ్ అయింది. ఈ వాచీ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే 45 రోజుల వరకు బ్యాటరీ లైప్ ఉంటుంది. ఆప్టికల్ PPG హార్ట్ రేట్ సెన్సార్ ఫీచర్‌తో డిజైన్ కావడం వల్ల మీ హార్డ్ రేటును వెంటనే పసిగట్టేస్తుంది.సైక్లింగ్ చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు మీ హార్ట్ రేటు ఎంతో ఉందో చెప్పేస్తుంది.
మల్టీ స్పోర్ట్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా 4 వరకు హృదయ సంబంధిత సమస్యలను ఈ సెన్సార్ గుర్తిస్తుంది. ఇందులో 3 యాక్సస్ యాక్సలరోమీటర్, బారోమీటర్, కంపాస్ కూడా ఉన్నాయి. ఇటీవలే హుయామి కంపెనీ అమెజ్ ఫిట్ బిప్ స్మార్ట్ వాచ్‌ను ఇండియాలో రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి అడ్వాన్స్ గా లైట్ వెర్షన్‌ను ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్, iOS డివైజ్ లో పనిచేసేలా డిజైన్ చేశారు. రియల్ టైం యాప్ నోటిఫికేషన్స్ కూడా ఈ స్మార్ట్ వాచ్ అందిస్తుంది.
1.28 అంగుళాల డిస్ ప్లేతో పాటు ఎప్పుడూ డిస్‌ప్లేతో పాటుగా ఫిట్ నెస్ సెంట్రిక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. మొబైల్ డివైజ్ కు ఈ స్మార్ట్ వాచ్ ను కనెక్ట్ చేయగానే వాయిస్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించి నోటిఫికేషన్లు అందిస్తుంది. 30మీటర్ల వాటర్ రిసిస్టంట్ తో పాటు స్విమ్ ప్రూఫ్ కూడా ఉంది. 32గ్రాముల బరువుతో క్లాసిక్ కర్వడ్ కార్నర్ డిజైన్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. జూలై 15 నుంచి Amazon.in వెబ్ సైట్లో విక్రయించనున్నారు.దీని ధర ధర రూ.3వేల 999గా నిర్ణయించారు. 2018 ఏడాదిలో విడుదల చేసిన అమెజ్‌ఫిట్ బిప్ స్మార్ట్ వాచ్ ధర రూ.5వేల 499గా ఉంది.