టైమ్స్ మ్యాగజైన్.. ఈ ఏడాది ప్రపంచంలోనే 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మకు ప్లేస్ దక్కింది. దేశాధినేతలకు, అంబానీ, అజీమ్ ప్రేమ్‌జీ లాంటి బిజినెస్ టైకూన్లకే చోటు దక్కే ఆ లిస్ట్‌లో హిందీ మీడియంలో చదువుకున్న విజయ్ శేఖర్ శర్మ లాంటి ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి ప్లేస్ సంపాదించడం ఎక్స్‌ట్రా ఆర్డినరీ అచీవ్‌మెంట్.. దేశంలో నవంబర్ 8న డీమానిటైజేషన్ తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్లకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్న పేటీఎంకు అధిపతిగా విజయ్ ఈ గౌరవానికి అన్ని విధాల అర్హుడే. ఈ క్రెడిట్ పేటీఎందే కాదు.. డిజిటల్ ట్రాన్సాక్షన్లను స్వాగతించిన భారతీయులందరిదీ కూడా.
మోడీ, విజయ్ ఇద్దరే
ప్రపంచ పత్రికారంగంలో ఓ లెజెండ్ అయిన టైమ్స్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం వరల్డ్స్ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్సియల్ మెన్ అని 100 మందితో ఓ లిస్ట్‌ను రిలీజ్ చేస్తుంది. తమ నిర్ణయాలు, తమ చర్యలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రభావం చూపినవాళ్లకు ఈ లిస్ట్‌లో ప్లేస్ దక్కుతుంది. ఈసారి జాబితాలో ఇద్దరు ఇండియన్స్‌లో ఇద్దరికే చోటు దొరికింది. అందులో ఒకరు ప్రైం మినిస్టర్ మోడీ, మరొకరు పేటీఎం విజయ్ శేఖర్.. ఈ ఒక్క మాట చాలేమో ఆయనకు దక్కిన గౌరవం ఎంతో చెప్పడానికి.. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ పీఎం థెరిస్సా మే, పోప్ ఫ్రాన్సిస్.. ఇలాంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలతోపాటు ఓ సాధారణ ఎంటర్‌ప్రెన్యూర్ అయిన విజయ్ ఈ లిస్ట్‌లో నిలవడాన్ని శభాష్ అనాల్సిందే.
డీమానిటైజేషన్‌తోనే టాప్ ప్లేస్‌కు
2016 జనవరి నాటికి 12కోట్ల 20 లక్షల మంది పేటీఎం యాప్ యూజ్ చేస్తున్నారు. సంవత్సరం తిరిగేసరికి యూజర్ల సంఖ్య 17 కోట్ల 70 లక్షలకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలో ఐదున్నర కోట్ల కొత్త యూజర్లను పేటీఎం సొంతం చేసుకోగలిగింది. దీనికి కారణం డీమానిటైజేషన్తో చేతిలో సింగిల్ ఎన్పీ లేని దేశ ప్రజలకు పేటీఎం అండగా నిలబడింది. టీ స్టాళ్లు, కొబ్బరి బొండాలు అమ్మవారు కూడా పేటీఎం యాక్సెప్టెడ్ బోర్డు పెట్టేశారు. అంతగ్రౌండ్ లెవెల్‌కు వాలెట్‌ను తీసుకెళ్లడంలో విజయ్ శేఖర్ సాధించి సక్సెస్‌కు వచ్చిన గిఫ్ట్ .. టైమ్స్ జాబితాలో చోటు.