• తాజా వార్తలు

ఇర‌వై ఏళ్లుగా మ‌నం చూస్తున్న "ఇంటెల్ ఇన్‌సైడ్‌" కు ఇదే ఆఖ‌రి సంవ‌త్స‌ర‌మా?


కంప్యూట‌ర్ చిప్స్ (సిలికాన్ బేస్డ్ సెమీ కండ‌క్ట‌ర్స్‌) త‌యారీలో రెండు ద‌శాబ్దాలుగా రారాజులా వెలుగొందిన ఇంటెల్ ఆధిప‌త్యానికి శాంసంగ్ గండికొట్టింది.  ఈ ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు సెమీ కండ‌క్ట‌ర్స్ బిజినెస్‌లో ఇంటెల్ ను వెన‌క్కినెట్టి శాంసంగ్  ఫ‌స్ట్ ప్లేస్లోకి దూసుకుపోయింది.  మొబైల్‌ఫోన్లు, టీవీలు, కంప్యూట‌ర్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్ల వంటి గృహోప‌క‌ర‌ణాల్లో వ‌ర‌ల్డ్ టాప్ కంపెనీగా ఉన్న ద‌క్షిణ కొరియా సంస్థ శాంసంగ్‌..  ఇప్పుడు కంప్యూట‌ర్ చిప్స్ త‌యారీలోనూ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది.   20వ శ‌తాబ్దంలో క్రూడ్ ఆయిల్ (ముడి చ‌మురు) బిజినెస్ ప్ర‌పంచంలో ఎంత హ‌వా న‌డిపిందో 21వ శతాబ్దంలో కంప్యూట‌ర్ చిప్స్ బిజినెస్ ఆ  స్థాయిలో పేరు గ‌డించింది.

46 ల‌క్ష‌ల   కోట్ల ఆదాయం
శాంసంగ్ ఈ  క్వార్ట‌ర్ (ఏప్రిల్‌- జూన్‌)లో 15.8 బిలియ‌న్ డాల‌ర్స్  ( దాదాపు ల‌క్ష కోట్ల రూపాయ‌లకు పైగా) బిజినెస్ చేసింది. దీనిలో 7.2 బిలియ‌న్ డాల‌ర్స్ (46 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌) ఆప‌రేటింగ్ ఇన్‌క‌మ్ వచ్చినట్లు శాంసంగ్ గురువారం ప్ర‌క‌టించింది.   మ‌రోవైపు ఇన్ టెల్ ఈ క్వార్ట‌ర్‌లో 14.4 బిలియ‌న్ డాల‌ర్ల (92 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌) రెవెన్యూ మాత్ర‌మే సాధించగ‌లిగింది. ఇదే కంటిన్యూ అయితే ఈ ఏడాదిలోనే ఇంటెల్ నెంబ‌ర్‌వ‌న్ స్థానాన్ని శాంసంగ్ పూర్తి స్థాయిలో అందుకోగ‌లుగుతుంద‌ని మార్కెట్ అంచ‌నా.   ఈ  ఏడాది  ఇంటెల్ బిజినెస్ 60 బిలియ‌న్ డాల‌ర్స్ (3 ల‌క్ష‌ల 84 వేల కోట్ల రూపాయ‌లు) ఉంటుంద‌ని, అదే శాంసంగ్ బిజినెస్ 4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు దాటుతుంద‌ని  ఫాక్ట్‌సెట్ కంపెనీ అంచ‌నా వేసింది. 
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్ ల వ‌ల్లే టాప్ ప్లేస్‌కి
చిప్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ మొబైల్ గ్యాడ్జెట్లలో ఎక్కువ మెమరీని స్టోర్ చేయ‌గ‌లిగేలా త‌యారు చేస్తున్నారు. మొబైల్ అప్లికేష‌ను్ల‌, క‌నెక్టెడ్ డివైస్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ స‌ర్వీసులు పెరుగుతు్న కొద్దీ  మెమ‌రీ చిప్స్ డిమాండ్ దానితోపాటు కాస్ట్ కూడా పెరుగుతోంది. ఈ రంగంలో పెద్ద కంపెనీగా శాంసంగ్ ఉండ‌డం దాన్ని సెమీ కండ‌క్ట‌ర్స్ బిజినెస్‌లో నెంబ‌ర్ వ‌న్‌గా  నిల‌ప‌డానికి కార‌ణ‌మైంది. యూఎస్ కంపెనీ అయిన ఇంటెల్ 1992 నుంచి ప్రాసెస‌ర్స్ త‌యారీలో నెంబ‌ర్ వ‌న్‌గా ఉంది.  అయితే కంప్యూట‌ర్ల కంటే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల వాడ‌కం పెరుగుతుండ‌డం శాంసంగ్‌కు ఈ రంగంలో టాప్ ప్లేస్‌కు వెళ్ల‌డానికి ఉప‌యోగ‌ప‌డింది.  
 

జన రంజకమైన వార్తలు