ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కోట్లాది అంశాలపై సమగ్ర సమాచారం అందించే వికీపీడియా వెబ్ సైట్ ను టర్కీ ప్రభుత్వం నిషేధించింది. వికీపీడియా లాంటి ఇన్ఫర్మేషన్ సైట్ పై టర్కీ గవర్నమెంటుకు కోపం రావడానికి కారణం ఉంది. వికీపీడియాలో ప్రతి అంశంపైనా సమాచారం ఉంటుంది.. అలాగే టెర్రరిజం గురించి కూడా ఉంది. అలాంటివి తొలగించాలని టర్కీ ఆదేశించింది. కానీ... వికీపీడియా వినకపోవడంతో ఏకంగా నిషేధం విధించింది.
టెర్రర్ ఆర్టికల్సే కారణం
ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉన్న ఆర్టికల్స్ ను తొలగించాలని తాము ఆదేశించినప్పటికీ, వికీపీడియా యాజమాన్యం దాన్ని పట్టించుకోలేదని, ఈ కారణంతోనే నిషేధాన్ని విధించామని టర్కీ ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. టర్కీకి వ్యతిరేకంగా ఉగ్రవాదులు జరుపుతున్న ప్రచారానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని వికీపీడియా అందిస్తోందని, దీని వల్ల జాతి భద్రతకు విపత్తేనని వారు అంటున్నారు.
ఇంకా ఛాన్సుంది..
కాగా వికీపీడియాలోని అన్ని ఆర్టికల్స్... అన్ని భాషల్లో ఉన్న ఆర్టికల్స్ మొత్తం నిషేధించారు. మళ్లీ వికీపీడియా యాజమాన్యం టర్కీలో ఓ కార్యాలయాన్ని ప్రారంభించి, పన్నులు చెల్లిస్తూ, టర్కీ వ్యతిరేక కంటెంట్ ను తొలగించాకే నిషేధం ఎత్తివేస్తామని టర్కీ ప్రభుత్వం చెబుతోంది. మరి.. వికీపీడియా ఏం చేస్తుందో చూడాలి. వికీపీడియాకు ఇంతకుముందు ఎన్నడూ ఈ స్థాయిలో దెబ్బ పడలేదు. దీంతో దిగొస్తుందనే అనుకుంటున్నారు.