• తాజా వార్తలు

గూగుల్ సెర్చ్ ద్వారా పుడ్ ఆర్డర్ చేయవచ్చు

గూగుల్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరో కొత్త ఫీచర్ ని జోడించింది. ఈ ఫీచర్ కేవలం యుఎస్ లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యూజర్లు ఇక అడిషనల్ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా నేరుగా గూగుల్ ద్వారానే పుడ్ ఆర్డర్ చేయవచ్చు. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ద్వారా కాని సెర్చ్ ద్వారా కాని ఆన్ లైన్ పుడ ఆర్డర్ చేయవచ్చు ఇందుకోసం మ్యాప్ లో గూగుల్ కొత్తగా Order Online ఫీచర్ ని యాడ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా దగ్గర్లో ఏదైనా రెస్టారెంట్ ఉంటే వెంటనే ఆ రెస్టారెంట్ అక్కడ కనిపిస్తుంది. మీరు పుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. 

యూజర్లు పుడ్ ఫికప చేసుకోవడం కాని అలాగే ఇష్టమైన పుడ్ ని ఆర్డర్ చేయడం కాని మరే ఇతర అంశాలౌనా అందులో కనిపిసస్తాయి. రెస్టారెంట్ దగ్గర్లో ఉంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికి పేమెంట్ ఎలా చెల్లించాలంటే Google's interface and Google Pay ద్వారా మనీ చెల్లించాల్సి ఉంటుంది.యూజర్లు గూగుల్ వాయిస అసిస్టెంట్ ద్వారా పాత ఆర్డర్ రిపీట్ చేయమని కూడా కోరవచ్చు. అయితే ఈ ఫీచర్ గూగుల్ అసిస్టెంట్ తో అనుసంధానమైన స్పీకర్స్ ద్వారా పనిచేస్తుందా లేక స్మార్ట్ డిస్ ప్లే ద్వారా పనిచేస్తుందా అనేదానిపై ఎటువంటి  క్లారిటీ లేదు.

యూజర్లకి 5 రకాల డెలివరీ ఆప్సన్లు అందుబాటులో ఉన్నాయి.DoorDash, Postmates, Delivery.com, Slice, and ChowNow అనే ఆప్సన్లను ఇందులో పొందుపరిచారు. యూజర్లు వీటిల్లో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా గూగుల్ Zuppler ఇతర ఫీచర్లను సపోర్ట్ చేసే విధంగా ఫీచర్ యాడ్ చేయనుందని తెలుస్తోంది.

కాగా ఈ మధ్య కంపెనీ సెర్చ్ ఇంజిన్ లో కొత్త ఫీచర్ ని యాడ్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్న తెలిసిందే. సెర్చ్ ఇంజిన్ ఆప్సన్ ద్వారా సమాచారం ఎక్కడ నుంచి వస్తుంది అలాగే సమాచారం ఎక్కడికి వెళుతుంది అనే విషయాలను మొబైల్ యూజర్లు తెలుసుకునేందుకు వీలుగా ఈ ఫీచర్ రానుంది. దీని ద్వారా యూజర్లు తమ పనిని మరింత తేలికగా చేసుకునే అవకాశం ఉంది. 
 

జన రంజకమైన వార్తలు