• తాజా వార్తలు

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 20 మంది ప్రాణాలను కాపాడిందని మీకు తెలుసా ?

శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్ ఏకంగా 20 మంది ప్రాణాలను కాపాడిన సంఘటన శాంసంగ్ కంపెనీని, అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. సముద్రంలో మునిగిన 20 మంది ప్రాణాలను శాంసంగ్ గెలాక్సీ ఎస్8 రక్షించిందని కంపెనీ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకెళితే.. ఫిలిప్పైన్స్‌లో సెబూ నగరంలోని దాన్ బంటయాన్ మలపస్కా ద్వీపంలో మోటార్ బోట్ మునిగింది. ఈ ప్రమాదంలో 20 మంది సముద్రంలో మునిగిపోయినట్టు స్థానిక మీడియా నివేదించింది. పడవలో ప్రయాణిస్తున్న 16మంది విదేశీ ఈతగాళ్లతో పాటు నలుగురు ఫిలిప్ఫినో జాతీయులు ఉన్నారు. నీటిలో మునిగిన ప్రయాణికుల్లో కెనడాకు చెందిన ప్రయాణికుడి దగ్గర శాంసంగ్ గెలాక్సీ S8 స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు ఓ బ్లాగ్ పోస్టు తెలిపింది. 

పడవ సముద్రంలో మునిగిన 30 నిమిషాల ద్వారా శాంసంగ్ ఫోన్ ద్వారా కోస్టు గార్డులకు ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. GPS లొకేషన్ ఆధారంగా ట్రాప్ చేసిన కోస్ట్ గార్డులు ప్రయాణికులను రక్షించారు. శాంసంగ్ గెలాక్సీ S8లో IP68 రేటింగ్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్‌ను 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల లోతున్న నీటిలో ఉంచితే చాలు.. అందులోని SOS ఫీచర్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. తద్వారా మెసేజ్ ఎమర్జెన్సీ సెంటర్‌కు వెళ్తుంది.

పడవ ప్రమాద సమయంలో కూడా శాంసంగ్ గెలాక్సీ S8 ఫీచర్ యాక్టివేట్ అయి సమీపంలోని ఎమర్జెన్సీ సెంటర్‌కు మెసేజ్ వెళ్లింది. అప్రమత్తమైన కోస్టల్ గార్డ్సు ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. ఈ ఘటన అనంతరం కెనడా జాతీయుడు తన స్మార్ట్ ఫోన్ తీసుకుని శాంసంగ్ కంపెనీ దగ్గరకు వెళ్లాడు.అక్కడి ఇంజినీరింగ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.ఎమర్జెన్సీ SOS యాక్టివేట్ అయినప్పటి నుంచి అలానే ఉండిపోయిందని తెలిపాడు.

 శాంసంగ్ నుంచి గెలాక్సీ S8 రెండేళ్ల క్రితమే రిలీజ్ అయింది. శాంసంగ్ ప్రవేశపెట్టిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఇంగ్రెస్ ప్రొటక్షన్ లేదా IP రేటింగ్ వివిధ స్థాయిలో ఉంటుంది. శాంసంగ్ కొత్తగా రిలీజ్ చేసిన గెలాక్సీ S9, గెలాక్సీ S10 సిరీస్ ఫోన్లలో కూడా IP68 రేటింగ్ టెక్నాలజీ ఉంది. 

జన రంజకమైన వార్తలు