ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా వీడియో గేమ్స్ రాజ్యమేలుతున్నాయి. పిల్లలు వీడియో గేమ్‌లకే అతుక్కుపోతున్నారా? అవుట్‌డోర్ గేమ్స్ కంటే ఇండోర్ గేమ్స్‌కే పరిమితం అవుతున్నారా? అయితే వారిలో ఫీలింగ్స్ తగ్గిపోతాయని పరిశోధనలో వెల్లడైంది. వీడియోగేమ్స్‌కు పిల్లలు అడిక్ట్ చేస్తున్నారు. వయొలెన్స్ వీడియో గేమ్స్ ఆడటం వల్ల విపరిణామాలు సంభవిస్తాయని తాజా పరిశోధనలు తెలిపాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొన్ని నిజాలను తెలిపింది.
వీడియో గేమ్‌లకు బానిసలైపోతున్న వారి మానసికస్థితి సరిగా ఉండటం లేదని డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది.వీడియోగేమ్స్ కారణంగా పిల్లలు మానసిక వ్యాధులబారిన పడుతున్నారని, రోజువారి జీవితంలో ఈ వీడియోగేమ్స్ ప్రభావం కూడా ప్రతికూలంగా ఉంటోందని తేల్చింది. ఎక్కువ సేపు గేమ్స్ ఆడేవారి ఇతర ఆసక్తులను, కార్యకలాపాలను ఈ గేమ్స్ నిర్లక్ష్యం చేస్తున్నాయని, వీడియో గేమ్స్ ఆడుతూ నిద్ర, తిండి కూడా పట్టించుకోవట్లేదని వెల్లడించింది. ‘వీడియో గేమ్ అడిక్షన్’ని మెంటల్ డిజార్డర్‌గా డబ్ల్యూహెచ్‌ఓ అధికారికంగా ప్రకటించింది.
వీడియో గేమ్స్ ఆడటం పిల్లలకు భలే సరదా. ఒక్కసారి వయొలెన్స్ వీడియో గేమ్స్ (తుపాకీతో షూట్ చేయటం, కత్తి, గొడ్డలి.. లాంటి వాటితో యుద్ధాలు చేయటం)కు అలవాటు పడితే ఇక అంతే సంగతులని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియో శాంటా బార్బరా, యూనివర్శిటీ ఆఫ్ బఫెలో పరిశోధకులు అంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి వీడియోగేమ్స్ ప్రతిరోజూ ఆడటం వల్ల ఎవరైనా సరే వారిలో హింసా ప్రవృత్తి గణనీయంగా పెరుగుతుందని వారు అంటున్నారు.
ఒక్కమాటలో భావోద్వేగాల పరంగా ఎలాంటి మార్పులు ఉండవట, అసలు వారిలో గిల్టీ ఫీలింగ్ అనేదే మనసులో ఉండదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పదే పదే వయొలెంట్ వీడియో గేమ్స్ ఆడటం ద్వారా పిల్లల్లో దయ, జాలి, కరుణ లాంటి మంచి లక్షణాలు బాగా తగ్గిపోతాయని పరిశోధకులు వాపోతున్నారు. అంతేగాకుండా విపరీతమైన కోపం, గొడవకు దిగే నైజం అలవాటవుతుంది, వీటితో పాటు నెగెటివ్ యాక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా వీడియోగేమ్స్‌లో మాదిరే తాను చేస్తే పోలా అనే ఆలోచన వచ్చేస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.