• తాజా వార్తలు

ఇకపై మీ లోకేషన్ హిస్టరీ ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుంది, గూగుల్ నుంచి Auto-Delete Tool

టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ యూజర్ల కోసం కొత్త టూల్ ను ప్రవేశపెట్టింది. ఇకపై గూగుల్ సెర్చ్ లో వెతికిన యూజర్ల డేటాను వారు మ్యానువల్ గా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటో డిలీట్ ఆప్షన్ ద్వారా దానికదే డిలీట అవుతుంది. గూగుల్ సెర్చ్ యూజర్ల కోసం ప్రత్యేకించి గూగుల్ Auto-Delete Toolను అందుబాటులోకి తెచ్చింది.  ఈ ఫీచర్ ద్వారా గూగుల్ ప్లాట్ ఫాంపై సెర్చ్ చేసే యూజర్ లొకేషన్ ట్రాకింగ్,వెబ్, యాప్ యాక్టివిటీ హిస్టరీని మ్యానువల్ గా డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే.. ఆటోమాటిక్ గా డిలీట్ అవుతుంది. 

ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ రెండెంటీలో యూజర్లు వాడిన యాక్టివీటి డేటా, లొకేషన్ హిస్టరీ ఈ టూల్ ద్వారా ఆటోమాటిక్ గా డిలీట్ అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్ ల్లోని సెర్చ్ లొకేషన్ హిస్టరీ క్లియర్ చేసేందుకు Auto-Delete’ కంట్రోల్స్ ప్రవేశపెట్టాం. మీ హిస్టరీ డేటాను గూగుల్ నుంచి సులభంగా డిలీట్ చేసుకోవచ్చని ఇంటర్నెట్ దిగ్గజం ట్విట్టర్ పోస్టులో తెలిపింది.

యూజర్ ప్రైవసీ ఇష్యూపై ఇటీవల జరిగిన డెవలపర్ కాన్ఫిరెన్స్ లో గూగుల్, ఆపిల్ సహా ఇతర టెక్ దిగ్గజాలు సుదీర్ఘంగా చర్చించాయి. ఈ సమావేశంలో యూజర్ల ప్రైవసీ కోసం కొత్త టూల్స్ ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. థర్డ్ పార్టీ యాప్స్ ల్లో యూజర్లు షేర్ చేసిన డేటా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఆటో డిలీట్ టూల్ వంటి ఫీచర్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఆటో డిలీట్ టూల్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది.

ఈ ఫీచర్ ని యూజర్లు తమ బ్రౌజర్ లో ట్రాకింగ్ ఫ్రిపెరెన్సెస్ ద్వారా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో 3 నెలలు లేదా 18 నెలలు వరకు సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకుంటే అలా మీ డేటా ఆటోమేటిక్ గా ఆ సమయానికి డిలీట్ అయిపోతుంది.

జన రంజకమైన వార్తలు