• తాజా వార్తలు

లేటెస్ట్ సెన్సేషన్ ‘గూగుల్ లెన్స్’ వస్తే సెర్చింగ్ మరింత ఈజీ

గూగుల్ డెవలపర్ల వార్షిక ఐ/ఓ కాన్ఫరెన్స్ అనగానే ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియుల్లో ఎక్కడలేనంత ఆసక్తి ఏర్పడుతుంది. గూగుల్ ఏమేం కొత్త ప్రొడక్ట్ లు తీసుకురానుందా అని ఎదురుచూస్తుంటారు. గూగుల్ ప్రధాన కార్యాలయంలో రీసెంటుగా నిర్వహించిన ఈ సమావేశంలో టెక్ ప్రేమికుల ఆసక్తి తగ్గట్లుగానే పలు కీలక ఫీచర్లు, ప్రొడక్టులు అనౌన్స్ చేసింది.
క్లారిటీ ఇచ్చిన పిచాయ్‌
ఆండ్రాయిడ్ గో, కొత్త వీఆర్ హెడ్ సెట్, గూగుల్ లెన్స్ ఇలాంటి కొన్ని కీలకమైన విషయాల్లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ డెవలపర్ల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. వీటన్నంటిల్లో టెక్ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నది గూగుల్ లెన్స్. దీన్ని టెక్నాలజీలో మరో విప్లవంగా అభివర్ణించిన సుందర్ పిచాయ్, అసలు గూగుల్ లెన్స్ యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు
సాధారణంగా మనం దేన్నైనా చూసి దాని గురించి తెలుసుకోవాలంటే ఆ పేరును టైప్ చేసి సెర్చ్ చేస్తాం. కానీ గూగుల్ లెన్సుతో అలాంటి అవసరం ఉండదు. మీకు సమాచారం కావాల్సిన వస్తువును ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు. దాన్ని గురించి పూర్తి సమాచారం మన ముందుంటుంది. దీనికల్లా మనం చేయాల్సింది మన స్మార్ట్ ఫోన్లో గూగుల్ లెన్స్ డౌన్ లోడ్ చేసుకోవడమే. ఉదాహరణకు మనకో పండు కనిపించిందనే అనుకోండి.... ఆ పండు పేరేంటి... దాని వివరాలు కావాలంటే? దాన్ని లెన్స్ లో ఫోటో తీస్తే చాలు మొత్తం సమాచారం మన ముందు ఉంటుంది.
చాలా ఉప‌యోగం
ఒక్కోసారి కొత్త ప్రాంతాలకు వెళ్తే అక్కడి భాష మనకు అర్థం కాకపోవచ్చు. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తిన్నాలన్నా, ఆర్డర్ చేయాలన్నా కూడా అది ఎలా ఉంటుందో... ఎంత ధరో అని వెనుకాడొచ్చు. దీనికోసం జస్ట్ మీముందున్న డిష్ ను ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు దాని గురించి వివిధ రకాల సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఇమేజ్ సెర్చ్ తోనే అన్నింటి వివరాలను యూజర్లు తెలుసుకునేలా గూగుల్ ఈ ఆప్షన్ ను తీసుకొస్తోంది. అయితే మనం స్కాన్ చేసే వస్తువు వివరాలు గూగుల్ లో ఉంటేనే, దాన్ని సమాచారం మనకు అందుతుంది. గూగుల్ లెన్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ వినూత్న ఫీచర్ త్వరలోనే స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి రానుంది.

జన రంజకమైన వార్తలు