టెలికాం రంగంలో సంచలనాలకు వేదికైన జియో ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం సొంత బ్రౌజర్‌ను సృష్టించింది. జియోపేజెస్ పేరుతో లాంచ్ చేసిన ఈ మేడిన్ ఇండియా బ్రౌజర్ 8 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.
ఏమిటీ జియో పేజెస్
ఇది పూర్తిగా జియో సొంత బ్రౌజర్. ఇండియాలో తయారైన ఈ బ్రౌజర్ ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ జియోపేజెస్ బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ డివైస్‌లన్నింటిలోనూ దీన్ని వాడుకోవచ్చు.
ఇవీ ఫీచర్లు
* జియోపేజెస్ వెబ్ బ్రౌజర్‌ను మీకు కావాల్సినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. డార్క్ మోడ్‌తోపాటు కలర్‌ఫుల్ బ్యాక్ గ్రౌండ్‌లను సెలెక్ట్ చేసుకోవచ్చు.
* గూగుల్ క్రోమ్‌లో మాదిరిగానే జియోపేజెస్ బ్రౌజర్‌లో కూడా ఫేవరెట్ వెబ్‌సైట్లను హోం స్క్రీన్ మీద పిన్ చేసుకుని ఫాస్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు.
* క్రోమ్ మాదిరిగానే దీనిలో కూడా మీకు నచ్చిన కంటెంట్ మాత్రమే వచ్చేలా పర్సనలైజ్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసిన ఫీల్డ్‌లకు సంబంధించిన కంటెంట్‌ను మాత్రమే ఈ జియోపేజెస్ బ్రౌజర్ మీకు అందిస్తుంది.
* సేఫ్ బ్రౌజింగ్ కోసం సెక్యూర్డ్ ఇన్‌కాగ్నిటో మోడ్ కూడా ఉంది.
* జియోపేజెస్ బ్రౌజర్‌లో మరో సూపర్ ఫీచర్ ఏమిటంటే యాడ్ బ్లాకర్. మీరు ఈ యాడ్ బ్లాకర్‌ను యాక్సెస్ చేస్తే అనవసరమైన యాడ్స్, పాప్ అప్ మెసేజ్‌లు రాకుండా నిరోధించగలదు.
8 ప్రాంతీయ భాషల్లో లభ్యం
జియోపేజెస్ యాప్ ప్రధానంగా ఇండియాలోని ప్రాంతీయ భాషల యూజర్లను దృష్టిలో పెట్టుకుని తయారుచేశారు. 8 భారతీయ భాషలను ప్రస్తుతం ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. హిందీ, మరాఠీ, మలయాళం, తెలుగు, బెంగాలీ, గుజరాతీ, తమిళ్, కన్నడ భాషల్లో జియోపేజెస్ బ్రౌజర్‌ను వాడుకోవచ్చు. యూజర్ తన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోగానే వారికి ఆ భాషలోని పాపులర్ వెబ్‌సైట్లు స్క్రీన్‌మీద కనిపిస్తాయి.