• తాజా వార్తలు

100 GB కేవలం రూ 500/- లకే – జియో ఫైబర్ ప్రారంభ ఆఫర్

గత సంవత్సరం లాంచ్ అయిన దగ్గరనుండీ భారత ఇంటర్ నెట్ రంగాన్ని జియో తీవ్రంగా ఏదో ఒక విధంగా తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ప్రభావితం చేస్తూనే ఉంది. గణనీయంగా పెరిగిన 4 జి VOLTE హ్యాండ్ సెట్ ల సంఖ్య మరియు వినియోగదారుల లలో పెరిగిన డిజిటల్ వినియోగం జియో అందిస్తున్న నమ్మశక్యం గాని ఆఫర్ లు వెరసి జియో ని ఇండియన్ టెలికాం మార్కెట్ లో ఈ స్థాయి లో నిలబెట్టాయి. జియో చెబుతున్నట్లు 10 కోట్ల కస్టమర్ లను సంపాదించిపెట్టాయి. అయితే జియో ఇక్కడితో ఆగాలి అనుకోవడం లేదు. సిమ్ ల ద్వారా అందించిన తన అద్భుతమైన సేవలను ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ కు కూడా విస్తరించే యోచనలో జియో ఉంది. దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్దం చేసింది. అన్నీ అనుకునట్లు ఈ సంవత్సరం దీపావళి నాటికల్లా జియో తన ఫైబర్ సేవలను అందించనుంది. ఈ నేపథ్యం లో జియో ఫైబర్ ద్వారా అందించనున్న అధ్బుత ఆఫర్ గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.
కంపెనీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా జియో ఫైబర్ ను టెస్ట్ చేసింది. ఢిల్లీ, నోయిడా లాంటి 10 ప్రముఖ నగరాలలో దీనిని లాంచ్ చేయనున్నారు. దీనిద్వారా గేటెడ్ కమ్యూనిటీ లలోనూ మరియు బహుళ అంతస్తుల భవనాలలో ఉండే వినియోగదారులను రిలయన్స్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. దీనియొక్క రెండవ ఫేజ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా మరొక 100 ప్రదేశాల్లో జియో ఫైబర్ ను ప్రారంభించనుంది. అది కూడా మనం చెప్పుకున్న ఆకాశ హర్మ్యాలు ఉన్న ప్రదేశాలలో.. జూన్ నుండీ అక్టోబర్ వరకూ రిలయన్స్ ఈ జియో ఫైబర్ కు సంబంధించి తన ట్రయిల్ లను ప్రారంభించనుంది.
ఇక ప్లాన్ ల విషయానికొస్తే జియో లో జరిగిన మాదిరిగానే జియో ఫైబర్ కు కూడా కొన్ని అద్భుతమైన ప్లాన్ లను రిలయన్స్ సిద్దం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రూ 500/- లకు 100జిబి డేటా ను జియో ఫైబర్ అందించనుంది. దీనితో పాటు కొన్ని ఫ్రీ ట్రయిల్ ప్యాక్ లను కూడా మనం ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ఈ నెట్ వర్క్ 100 Mbps వరకూ బ్యాండ్ విడ్త్ ను సపోర్ట్ చేయనుంది.
ఇప్పటికే 10 మిలియన్ ల బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ లతో BSNL అగ్ర స్థానం లో ఉండగా 1.95 మిలియన్ లతో ఎయిర్ టెల్ తర్వాతి స్థానం లో ఉంది. రూ 1099/- లకే 90 జిబి డేటా మరియు రూ 899/- లకే 60 జిబి డేటా ప్లాన్ లను ఎయిర్ టెల్ ఇప్పటికే ప్రకటించగా BSNL ఎలాంటి ప్లాన్ లను ప్రకటిస్తుందో చూడాలి. ACT, హత్ వే లాంటి మిగతా ISP లు కూడా మరిన్ని ఆకర్షణీయ ఆఫర్ లను అందించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ బ్రాడ్ బ్యాండ్ లో కూడా జియో ఒక విద్వంసక ఆవిష్కరణ కాబోతుంది అనడం లో సందేహం లేదు.

జన రంజకమైన వార్తలు