గూగుల్ మ్యాప్ అంటే అందిరికీ చాలా ఇష్టమనే విషయం చెప్పనే అవసరం లేదు. ట్రావెలింగ్ టైంలో అది చేసే మేలు అంతా ఇంతా కాదు. మనం ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అడ్రస్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఆశ్రయించేది గూగుల్ మ్యాప్ నే. అయితే ఈ గూగుల్ మ్యాప్ ఒక్కోసారి రాంగ్ రూట్ చూపిస్తుంది. ఎక్కడికో తీసుకుపోతుంది. అలాంటి సంఘటనే ఇప్పుడు బెంగుళూరులో జరిగింది.
గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని బెంగళూరులోని ఓ క్యాబ్ డ్రైవర్ ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని కోనప్పన అగ్రహారలో ఉండే ఓ కస్టమర్ కోసం వెతుకుతూ దీపక్‌కుమార్ (26) అనే క్యాబ్‌డ్రైవర్ మ్యాప్ చూపిన దిశలో వెళ్లాడు. తిన్నగా ఓ కార్ల పార్కింగ్ షెడ్డులోకి వెళ్లాడు. అక్కడి యజమానులు అతడిని అడ్డుకుని వాగ్యుద్ధానికి దిగారు. మాటామాటా పెరిగి చేయిచేసుకున్నారు. ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్లో తర్వాత దీపక్‌కుమార్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
జీపీఎస్ ఆదేశాలను అనుసరించిన జపనీస్ పర్యాటకులు తమ కారుతో సహా సముద్రంలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది.తప్పుడు జీపీఎస్ వ్యవస్థను అనుసరంచిన న్యూ జెర్నీ డ్రైవర్ తన కారును చట్టవిరుద్ధమైన ఎడమ మలుపుకు తిప్పవల్సి వచ్చింది. తప్పుడు జీపీఎస్ ఆదేశాలను అనుసరించిన ఓ మహిళ తన కారుతో సహా చిత్తడి ప్రదేశంలో చిక్కుకుపోయింది. గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించిన ఓ మహిళ కారును ఢీకొట్టింది. పాపం గూగుల్ ఎంత పనిచేసిందని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.