• తాజా వార్తలు

ఒక్క నిమిషంలో ఇంటర్నెట్‌లో జరిగే వండర్స్‌ని చూస్తే ఆశ్చర్యపోతారు 

ఇంటర్నెట్.. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న సాధనం. రోజువారీ జీవితంలో అది లేకుండా పనే జరగడం లేదు. ప్రతి చిన్నదానికి ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. మరి ఒక నిమిషంలో ఇంటర్నెట్లో ఏం అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ విషయాలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే మరి. మరి నిమిషం కాల వ్యవధిలో ఇంటర్నెట్లో ఏం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ఓ సారి చూద్దాం. 

గూగుల్ 
గూగుల్ ఒక నిమిఫం కాల వ్యవధిలో తన సెర్చ్ బార్ నుండి దాదాపు 38 లక్షల queriesని రిసీవ్ చేసుకుంటోంది
ఫేస్ బుక్ 
ఒక్క నిమిషం కాల వ్యవధిలో ఫేస్ బుక్ లాగిన్ అయ్యే వారి సంఖ్య లక్షకు పైగానే
మెసేజెస్ 
 ఒక్క నిమిషం కాల వ్యవధిలో వెళ్లే మెసేజ్ ల సంఖ్య 1,81,00,000. వినడానికి చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. కాని ఇది నిజం.
యూట్యూబ్
 ఒక్క నిమిషం కాల వ్యవధిలో యూట్యూబ్ వీడియోస్ ని వీక్షించే వారి సంఖ్య 4,05,00,000గా ఉంది.
యాప్ డౌన్లోడ్స్ 
గూగుల్ ప్లే స్టోర్ నుండి కాని అలాగే ఆపిల్ ప్లే స్టోర్ నుండి కాని 13390,030 apps ఒక్క నిమిషం కాల వ్యవధిలో డౌన్లోడ్ అవుతున్నాయి.
ఇన్‌స్టా‌గ్రామ్ 
ఒక్క నిమిషం కాల వ్యవధిలో ఇన్‌స్టా‌గ్రామ్ లో షేర్ అవుతున్న ఫోస్టుల సంఖ్య 347,222
ట్విట్టర్
ట్విట్టర్ ద్వారా  ఒక్క నిమిషం కాల వ్యవధిలో 87 వేల 500 ట్వీట్లు అవుతున్నాయి.
మనీ
ఒక్క నిమిషం కాల వ్యవధిలో ఆన్ లైన్ ద్వారా పెట్టే ఖర్చు 996,956 డాలర్లుగా ఉంది.
స్నాప్ ఛాట్ 
స్నాప్ ఛాట్  ఒక్క నిమిషం కాల వ్యవధిలో క్రియేట్ చేస్తున్న స్నాప్ ల సంఖ్య ఎంతో తెలుసా .. 2,04,00,000
సోషల్ మీడియా
వాట్సప్, ఫేస్ బుక్ ల ద్వారా ఒక్క నిమిషం కాల వ్యవధిలో41,06,00,000 million messages సెండ్ చేస్తున్నారు.
ఈమెయిల్స్
ఒక్క నిమిషం కాల వ్యవధిలో సెండ్ అయ్యే ఈమెయిల్స్ సంఖ్య 18,80,00,000
టిండర్
డేటింగ్ వెబ్ టిండర్ ద్వారా ఒక్క నిమిషం కాల వ్యవధిలో అయ్యే swipes సంఖ్య 14,00,000

జన రంజకమైన వార్తలు