• తాజా వార్తలు

రూ.500 నుంచే జియో గిగా‌ఫైబర్ ప్లాన్ స్టార్ట్ , జులై నుంచి లైవ్‌లోకి !

దేశీయ బ్రాడ్ బాండ్ రంగంలో ముఖేష్ అంబానీ ఎవరికి షాకివ్వబోతున్నారు. ఇప్పటికే టెలికాం రంగాన్ని ఓ ఊపు ఊపిన జియో మళ్లీ సునామి ఎంట్రీతో అందరికీ ముచ్చెమటలు పట్టించనుందనే వార్తలు ఇప్పుడు దిగ్గజాలను కలవరపెడుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే జియో గతేడాది సృష్టించిన ప్రభంజనం ఈ ఏడాది కూడా కంటిన్యూ కానుందంటున్నారు. ఏటా జూలైలో జరిగే యాన్యువల్ మీటింగ్‌లో కొత్త ప్రొడక్ట్‌ల గురించి ముకేష్ అంబానీ ప్రకటనలు చేస్తారు. త్వరలో జరగబోయే 42 యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్‌లో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఏం అనౌన్స్ చేయబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జియో గిగా‌ఫైబర్ ప్లాన్ గురించి అనౌన్స్ చేస్తారని అందరూ ఊహిస్తున్నారు. 
 
జియో నుంచి వచ్చిన అనధికార సమాచారం ప్రకారం జియో గిగా ఫైబర్ , జియోఫోన్ 3 మరియు జియో డీటీహెచ్ సర్వీస్ గురించి అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే జులై నాటి కల్లా జియో తన గిగా ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.  దీంతో పాటు జియో ప్లాన్ రూ.500 నుంచే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద నాలుగు వేల అయిదు వందలు చెల్లించాలనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే కొన్ని ఏరియాల్లో జియో గిగా ఫైబర్ మీద టెస్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. జియో గిగా ఫైబర్ ప్రారంభమయితే నాణ్యమయిన బ్రాడ్ బ్యాండ్ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఢిల్లీ, ముంబై లాంటి ఏరియాల్లో ఇప్పటికే జియో గిగాఫైబర్ ను వేలమంది వినియోగదారులు వాడుతున్నారు. ఇదే కాకుండా జియో ఫోన్ 3 గురించి వార్తలు వస్తున్నాయి. జియోఫోన్‌-3లో అనేక ఫీచర్లు ఉన్నాయి. 5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌తో, పవర్‌ఫుల్‌ సాఫ్ట్‌వేర్‌, ఆండ్రాయిడ్‌ గో, 2జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రానుందట. అంతేకాదు 5 ఎంపీ రియర్‌ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా స్పెషల్ అట్రాక్షన్ కానుంది. వీటన్నిటికి తోడు జియో డీటీహెచ్ సేవలు ప్రారంభం కానున్నాయి.

జన రంజకమైన వార్తలు