• తాజా వార్తలు

సిటీ యూత్‌.. మొబైల్‌ డేటా ఖ‌ర్చు నెలకు రూ.276

చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. దానిలో వాట్సాప్‌, ఫేస్‌బుక్ లేని యూత్ ఇండియాలో దాదాపు క‌న‌ప‌డ‌నంత‌గా స్మార్ట్‌ఫోన్ అల్లుకుపోయింది. పెద్ద‌గా చ‌దువుకోనివారు కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ను అవ‌లీల‌గా వాడేస్తున్నారు.ఇక కాలేజీ కుర్రోళ్ల సంగ‌తి చెప్పే ప‌నే లేదు. అందుకే ప‌ట్ట‌ణాల్లోని యువ‌త మొబైల్ డేటాకు నెల‌కు 276 రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ) లేటెస్ట్ రిపోర్ట్ ప్ర‌క‌టించింది.
జూన్ నాటికి 42 కోట్ల యూజ‌ర్లు
స్మార్ట్‌ఫోన్లు త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుండడం, టెలికం కంపెనీల టారిఫ్ వార్ తో డేటా రేట్లు బాగా త‌గ్గ‌డంతో ఇండియాలో మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య రాకెట్ స్పీడ్‌తో పెరుగుతోంది. జూన్ నెల‌క‌ల్లా వీరి సంఖ్య 42 కోట్ల‌వుతుంద‌ని అంచ‌నా. పట్టణాల్ల‌ని యూజ‌ర్ల సంఖ్య 25 కోట్లు, రూర‌ల్‌లో మొబైల్ డేటా వాడేవారు 17 కోట్లు ఉండొచ్చని , యూత్ ఎక్కువ‌గా మొబైల్‌ డేటాను వినియోగిస్తుండటమే దీనికి కార‌ణ‌మ‌ని ఐఏఎంఏఐ రిపోర్ట్ చెప్పింది. లాస్ట్ డిసెంబ‌ర్‌తో కంపేర్ చేస్తే జూన్‌కు 4కోట్ల మంది మొబైల్ డేటా యూజ‌ర్లు పెరుగుతార‌ని రిపోర్ట్ ఎస్టిమేట్ చేసింది.
వాట్సాప్‌, ఫేస్‌బుక్ యూసేజే కార‌ణం
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక అనుసంధాన వేదికలను ఉపయోగించుకోవడానికి; వినోదం కోసం ఎక్కువగా మొబైల్‌ ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా టౌన్స్‌, సిటీస్‌లో యూత్ వాట్సాప్‌, ఫేస్‌బుక్ ఎక్కువ‌గా వాడుతున్నారు. డిజిట‌ల్ వాలెట్లు, బుక్‌మైషో వంటి యాప్‌లు బాగా యూజ్ చేస్తున్నారు. అర్బ‌న్ యూత్ నెల‌కు మొబైల్ రీ ఛార్జిల‌పై 552 రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని, ఇందులో 50% డేటాకే ఖ‌ర్చు పెడుతున్నార‌ని రిపోర్ట్ చెప్పింది. 45 ఏళ్ల లోపు వారు ఈ ర‌క‌మైన యూసేజ్ చేస్తున్నారు.

జన రంజకమైన వార్తలు