• తాజా వార్తలు

స్నాప్‌డ్రాగ‌న్ 730/730G  ప్రాసెస‌ర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ల‌లో బెస్ట్ ఏవి?

ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఇప్పుడు అత్యంత శ‌క్తిమంత‌మైన స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్లు వ‌స్తున్నాయి. మ‌ల్టీటాస్కింగ్‌, గేమింగ్స్‌కు కూడా మ‌న ఫోన్లు ప‌నికొచ్చేలా ఈ ప‌వ‌ర్‌ఫుల్ ప్రాసెస‌ర్ల‌ను తీర్చిదిద్దుతున్నారు. వీటిని త‌యారుచేసే క్వాల్‌కామ్ సంస్థ రీసెంట్‌గా రెండు ఫ్లాగ్‌షిష్ ప్రాసెస‌ర్ల‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 730, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 730G  అనే ఈ రెండెఉ ప్రాసెస‌ర్ల‌లో క్వాల్‌కామ్ సిరీస్‌లోనే మూడో అత్యంత శ‌క్తిమంత‌మైన ప‌వ‌ర్‌ఫుల్ చిప్‌సెట్ ఉంది. ఈ ప్రాసెస‌ర్ల‌ను ఇటీవ‌ల వ‌చ్చిన ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో ఉప‌యోగిస్తారు.  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 730, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 730G ప్రాసెసర్ల‌తో వ‌చ్చిన ఫోన్ల‌లో బెస్ట్ ఫోన్ల వివ‌రాలు మీ కోసం


స్నాప్‌డ్రాగ‌న్  730G ప్రాసెస‌ర్ ఉన్న స్మార్ట్ ఫోన్లు
1. శాంసంగ్ గెలాక్సీ ఏ80

6.7 అంగుళా ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేతో వ‌చ్చిన  శాంసంగ్ గెలాక్సీ ఏ80లో 1.7 గిగా హెర్ట్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్  730G ప్రాసెస‌ర్ ఉంది. 
ర్యామ్‌: 8 జీబీ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌:  128 జీబీ 
కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమ‌రీ కెమెరా 
ఓఎస్‌: ఆండ్రాయిడ్ 9.0 పై 
బ్యాట‌రీ:  3700ఎంఏహెచ్ 
ధ‌ర: 39,900,

2.ఒప్పో రెనో 2 
6.5 అంగుళాల డైన‌మిక్ అమౌల్డ్  డిస్‌ప్లేతో వ‌చ్చిన  ఫోన్ ఒప్పో రెనో 2. ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్  730G ప్రాసెస‌ర్ ఉంది. 
ర్యామ్‌: 8 జీబీ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌:  256 జీబీ 
కెమెరా: 48, 8, 13, 2 మెగాపిక్సెళ్ల‌తో నాలుగు కెమెరాలున్న ప్రైమ‌రీ కెమెరా సెట‌ప్‌, ఫ్రంట్ 16 ఎంపీ కెమెరా
బ్యాట‌రీ:  4,000ఎంఏహెచ్ 
ధ‌ర: 36,900,

స్నాప్‌డ్రాగ‌న్  730 ప్రాసెస‌ర్ ఉన్న స్మార్ట్ ఫోన్లు
1. రెడ్‌మీ కే 20 

6.39 అంగుళాల అమౌల్డ్ డిస్‌ప్లేతో వ‌చ్చిన  రెడ్‌మీ కే20లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్  730 ప్రాసెస‌ర్ ఉంది. 
ర్యామ్‌: 6 జీబీ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌:  64 జీబీ 
కెమెరా: 48, 8, 12 ఎంపీతో మూడు కెమెరాల ప్రైమ‌రీ కెమెరా సెట‌ప్‌, 20 ఎంపీ ఫ్రంట్ కెమెరా 
ఓఎస్‌: ఆండ్రాయిడ్ (9.0) పై . త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 10కి అప్‌డేట్ కానుంది.
బ్యాట‌రీ:  4,000ఎంఏహెచ్ 
ధ‌ర: 22,999

2. రియ‌ల్‌మీ ఎక్స్‌టీ 730G 
6.40 అంగుళా ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేతో వ‌చ్చింది రియ‌ల్‌మీ ఎక్స్‌టీ 730G.  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్  730G ప్రాసెస‌ర్ ఉంది. 
ర్యామ్‌: 4 జీబీ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌:  64 జీబీ 
కెమెరా: 64, 8, 2, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన నాలుగు కెమెరాల  ప్రైమ‌రీ కెమెరా సెట‌ప్‌, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా
ఓఎస్‌: ఆండ్రాయిడ్ 9.0 పై 
బ్యాట‌రీ: 4,000ఎంఏహెచ్ 
ధ‌ర: 39,900,