• తాజా వార్తలు

నాలుగువేల నుండి 5వేల లోపు ధ‌ర‌లో బెస్ట్ ఎంట్రీ లెవెల్ ఫోన్లు ఇవీ..

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ మామూలుగా లేదు. 10 వేల‌కే లేటెస్ట్ ఫేషియ‌ల్ రిక‌గ్నైజేష‌న్ ఫీచ‌ర్‌తో కూడా ఫోన్లు వ‌చ్చేస్తున్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్లో 4వేల నుంచి 5వేల రూపాయ‌ల మ‌ధ్య ధ‌ర‌లో ఫోన్లు తేవ‌డంపై చాలా కంపెనీలు దృష్టి పెట్టాయి. అలా ఇటీవ‌లే మార్కెట్లోకి వ‌చ్చిన ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ల‌పై ఓ లుక్కేద్దాం రండి.. 

మొబీస్టార్ సీ క్యూ (Mobiistar CQ)
ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ల‌లో వ‌చ్చిన లేటెస్ట్ ఫోన్ ఇది.  త‌క్కువ ధ‌ర‌లోనే మంచి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చింది.  1280 x 720 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో కూడిన 5 ఇంచెస్ హెచ్‌డీ ఐపీస్ స్క్రీన్ దీని సొంతం. 
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 425 క్వాడ్ కార్ ప్రాసెస‌ర్‌
* 2జీబీ ర్యామ్ 
* ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌: 16 జీబీ 
*13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 ఎంపీ రియ‌ర్ కెమెరా 
* డ్యూయ‌ల్ సిమ్స్‌తోపాటు ప్ర‌త్యేకంగా మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్  
* 3,020 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర : 4,999 

టెన్ ఆర్ డీ (10.or D)
మంచి స్పెక్స్‌తో త‌క్కువ ధ‌ర‌లోనే అందుబాటులోకి వ‌చ్చిన మ‌రో ఫోన్ టెన్ ఆర్‌డీ. 2జీబీ/ 3జీబీ ర్యామ్‌, 16 జీబీ/ 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో రెండు వేరియంట్లు ఉన్నాయి. వెన‌క భాగంలో ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్నాయి. 5వేల రూపాయ‌ల ప్రైస్ రేంజ్‌లోఈ ఫీచ‌ర్లు అరుదే.
* 5.2 ఇంచెస్ హెచ్‌డీ స్క్రీన్ 
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 425 క్వాడ్ కార్ ప్రాసెస‌ర్‌
* 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 ఎంపీ రియ‌ర్ కెమెరా 
* 3,500 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర : 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధ‌ర 4,999. 3జీబీ ర్యామ్‌/32 జీబీ స్టోరేజ్ ధ‌ర రూ.5,999 

ఇవోమీ ఎంఈ3 (iVoomi Me3)
5వేల రూపాయ‌ల్లోపు మంచి ఫోన్ కొనాలంటే ఉన్న ఆప్ష‌న్ల‌లో ఇవోమీ ఎంఈ3 కూడా ఒక‌టి.  ఆండ్రాయిడ్ నోగ‌ట్ ఓఎస్‌తో ర‌న్న‌య్యే ఈ ఫోన్లో 1280 x 720 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో కూడిన 5.2 ఇంచెస్ హెచ్‌డీ షాట్ట‌ర్‌ప్రూఫ్ స్క్రీన్‌, దీనికి ర‌క్ష‌ణ‌గా 2.5 డీ కార్నింగ్ గ్లాస్ ఉంది
* మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌
* 2జీబీ ర్యామ్ 
* 16జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌: 128 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్‌
* 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 ఎంపీ రియ‌ర్ కెమెరా 
* 3,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర : 4,999 

నోకియా 1 (Nokia 1)
సెల్‌ఫోన్ అంటే వెంట‌నే గుర్తుకొచ్చే పేరు. హెచ్ఎండీఏ గ్లోబ‌ల్ కంపెనీ అండ‌ర్‌టేకింగ్‌లోకి వెళ్లాక ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్‌లో ప‌ట్టు కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగా ఎంట్రీ లెవెల్లో నోకియా 1 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్‌తో ర‌న్న‌వ‌డం ఒక్క‌టే ప్ల‌స్ పాయింట్ .ఫీచ‌ర్ల విష‌యంలో మిగిలిన వాట‌న్నింటి కంటే బాగా వెన‌కబ‌డింది. నోకియా బ్రాండ్‌తో కొనుక్కోవాలి త‌ప్ప ఫీచ‌ర్లేమీ ఆకట్టుకునేలా లేవు. 
* 854 x 480 పిక్సెల్స్ రిజ‌ల్యూష‌న్‌తో కూడిన 4.5 ఇంచెస్ ఎఫ్‌డ‌బ్ల్యూ వీజీఏ స్క్రీన్ 
* MT6737M మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌
* 1జీబీ ర్యామ్ 
* 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ 
* 2 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5 ఎంపీ రియ‌ర్ కెమెరా 
* 2,150 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర : 4,999 

స్వైప్ ఎలైట్ 3.. 4జీ (Swipe Elite 3 4G )
ఈ సెగ్మెంట్‌లో అతి చ‌వ‌కైన ఫోన్ ఇది. 
* 5.2 ఇంచెస్ హెచ్‌డీ స్క్రీన్ 
* Spreadtrum SC9832 క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌
* 2జీబీ ర్యామ్ .. 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ 
* 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 ఎంపీ రియ‌ర్ కెమెరా 
* 3,500 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధ‌ర : 3,999