• తాజా వార్తలు

7,500 రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో దొరికే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ మీకోసం

లాక్‌డౌన్‌తో రెండు నెల‌లుగా చాలామంది ప్ర‌జ‌ల‌కు ఆదాయం లేదు. ఎవ‌రి ఉద్యోగాలు ఉంటాయో, ఎవ‌రివి పోతాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న ఫోన్ పాడైపోతే కొత్త‌ది కొనాల‌న్నా ధైర్యం చాల‌ని పరిస్థితి. అందుకే బడ్జెట్‌లో అదీ 7,500 రూపాయల్లోపు ధ‌ర‌లో దొరికే మంచి ఫోన్ల లిస్ట్ మీకోసం ఇస్తున్నాం. 

మోటోరోలా మోటో ఈ6ఎస్‌
మోటోరోలా కంపెనీ నుంచి వ‌చ్చిన ఈ6ఎస్ మోడ‌ల్ ఫోన్ 7వేల లోపే దొరుకుతుంది. స్పెక్స్ కూడా బాగున్నాయి.
డిస్‌ప్లే: 6.1 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లే
కెమెరా: 13 ఎంపీ + 2 ఎంపీ డ్యూయ‌ల్ కెమెరాలు వెనక వైపు ఉన్నాయి.
8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 
ర్యామ్‌: 4జీబీ
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్:  64 జీబీ
ప్రాసెస‌ర్‌:  మీడియాటెక్ హీలియో పీ22 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ 
బ్యాటరీ: 3,000 ఎంఏహెచ్ 
ధ‌ర‌: 6,999 రూపాయ‌లు 

లెనోవో కే 9 నోట్ 
లెనోవో కూడా త‌న కే సిరీస్‌లో కే9 నోట్ పేరుతో ఇదే బ‌డ్జెట్ రేంజ్‌లో ఓ స్మార్ట్ఫోన్ తీసుకొచ్చింది. ఇది కూడా స్పెక్స్ ప‌రంగా బాగుంది.  ఓఎస్ ఆండ్రాయిడ్ 8.1. కాస్త పాత ఓఎస్ అని ఆలోచించ‌క‌పోతే ఇది మంచి డీల్‌.
డిస్‌ప్లే: 5.99 ఇంచెస్ నారో బీజిల్స్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
కెమెరా: 16 ఎంపీ + 2 ఎంపీ డ్యూయ‌ల్ కెమెరాలు వెనక వైపు ఉన్నాయి.
8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 
ర్యామ్‌: 4జీబీ
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్:  64 జీబీ
ప్రాసెస‌ర్‌:  స్నాప్‌డ్రాగ‌న్ 450 ఎస్‌వోసీ
బ్యాటరీ: 3,760 ఎంఏహెచ్ 
ధ‌ర‌: 7,499 రూపాయ‌లు 

 

రియల్‌మీ సీ 3 
7,500 లోపు బడ్జెట్లో బిగ్ స్క్రీన్‌, భారీ బ్యాట‌రీ కావాల‌నుకుంటే రియ‌ల్‌మీ సీ3 మంచి ఛాయిస్‌.  రామ్ త‌క్కువ ఉన్నా ప్రాసెస‌ర్ మంచి ఫాస్ట్‌గా ఉంటుంది.
డిస్‌ప్లే: 6.5 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే విత్ డ్రాప్ నాచ్‌. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌3 ప్రొటెక్ష‌న్ ఉండ‌టంతో చిన్న చిన్న స్క్రాచ్‌ల‌కు భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు
కెమెరా: 12 ఎంపీ + 2 ఎంపీ డ్యూయ‌ల్ కెమెరాలు వెనక వైపు ఉన్నాయి.
5 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 
ర్యామ్‌: 3జీబీ
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్:  32 జీబీ
ప్రాసెస‌ర్‌:  మీడియాటెక్ హీలియో జీ70
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ 
ధ‌ర‌: 7,499 రూపాయ‌లు 
ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌, ఫేస్ అన్‌లాక్ కూడా ఉండ‌టం ఈ సెగ్మెంట్‌లోని మిగ‌తా ఫోన్ల కంటే దీన్ని టాప్‌లో నిల‌బెట్టింది.  

 

ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2 
డిస్‌ప్లే: 6.26 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే విత్ డ్రాప్ నాచ్‌. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2.5డీ ప్రొటెక్ష‌న్ ఉంది.  
కెమెరా: 13 ఎంపీ + 2 ఎంపీ డ్యూయ‌ల్ కెమెరాలు వెనక వైపు ఉన్నాయి.
5 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 
ర్యామ్‌: 3జీబీ
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్:  32 జీబీ (మైక్రో ఎస్డీ కార్డ్‌తో 1టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు)
ప్రాసెస‌ర్‌:  ఈ ప్రైస్ రేంజ్‌లో అత్యంత శ‌క్తివంత‌మైన స్నాప్‌డ్రాగ‌న్ 632 ఎస్‌వోసీ ప్రాసెస‌ర్‌
బ్యాటరీ: 4,000ఎంఏహెచ్ 
ధ‌ర‌: 7,499 రూపాయ‌లు 

 

నోకియా 5.1 ప్ల‌స్ 
డిస్‌ప్లే: 5.8 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే విత్ డ్రాప్ నాచ్‌. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌3 ప్రొటెక్ష‌న్ ఉండ‌టంతో చిన్న చిన్న స్క్రాచ్‌ల‌కు భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు
కెమెరా: 12 ఎంపీ + 5 ఎంపీ డ్యూయ‌ల్ కెమెరాలు వెనక వైపు ఉన్నాయి.
5 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 
ర్యామ్‌: 3జీబీ
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్:  32 జీబీ
ప్రాసెస‌ర్‌:  మీడియాటెక్ హీలియో పీ60
బ్యాటరీ: 3,060ఎంఏహెచ్ 
ధ‌ర‌: 6,999 రూపాయ‌లు 
 

ఎల్‌జీ డ‌బ్ల్యూ30
 ఈ సెగ్మెంట్‌లో వెన‌క‌వైపు 3 కెమెరాలున్న ఏకైక ఫోన్ ఇదే.  సెల్ఫీ కెమెరా కూడా ప‌వ‌ర్‌ఫుల్‌గానే ఉంది. 
డిస్‌ప్లే: 6.26 ఇంచెస్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే విత్ డ్రాప్ నాచ్‌. 
కెమెరా: 12 ఎంపీ  ప్రైమ‌రీ కెమ‌రా, 12 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్స‌ర్ 
16 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా 
ర్యామ్‌: 3జీబీ
ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్:  32 జీబీ
ప్రాసెస‌ర్‌:  మీడియాటెక్ హీలియో పీ22
బ్యాటరీ: 3,000 ఎంఏహెచ్ 
ధ‌ర‌: 7,499 రూపాయ‌లు