దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ21ఎస్ పేరుతో దీన్ని బుధవారం లాంచ్ చేసింది. 48 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్‌తో భారీ బ్యాటరీ దీని ప్రత్యేకతలు. సెక్యూరిటీ ఫీచర్‌గా ఫేస్ రికగ్నిషన్‌నూ ఈ ఫోన్‌లో తీసుకొచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ 21ఎస్ ఫీచర్లు
* 6.50 అంగుళాల ఇన్ఫినిటీ ఓ డిస్ ప్లే
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* ఆక్టా-కోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఎస్‌డీ కార్డ్‌తో 512జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు
* బ్లాక్, బ్లూ , వైట్ కలర్స్‌లో దొరుకుతుంది.
క్వాడ్రపుల్ కెమెరాలు
శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ ఫోన్‌లో వెనకవైపు నాలుగు కెమెరాల క్వాడ్రపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్స్. 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతోపాటు 2ఎంపీ డెప్త్ సెన్సర్, మరో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
భారీ బ్యాటరీ
శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు.
ధరలు ఇవీ
* 4 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.16499
* 6 జీబీ ర్యామ్/ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 18499 రూపాయలు.
శాంసంగ్.కామ్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ సైట్లలో దొరుకుతుంది. ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ త్వరలో అందుబాటులోకి రానుంది.