సెల్‌ఫోన్ మార్కెట్‌లో పాతకాపు అయిన మోటోరోలా ఇటీవల వెనుకబడింది. అయితే లేటెస్ట్‌గా మోటోరోలా ఎడ్జ్ ప్లస్‌తో ఏకంగా ప్రీమియం ఫోన్ విభాగంలోనే పోటీకొచ్చింది. 108 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్‌తో 6కే వీడియోలను కూడా షూట్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. లేటెస్ట్‌గా మార్కెట్లోకి రిలీజయిన ఈ ఫోన్ విశేషాలు చూద్దాం.
ఇవీ స్పెసిఫికేషన్లు
* 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
* 12 జీబీ ర్యామ్
* 256 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
కెమెరాలు
వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. 16 మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ లెన్స్ ఉంది. దీనితో మీరు ఫోన్‌లో చూసేదానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ పిక్చర్‌ను క్యాప్చర్ చేయొచ్చు. వీటితోపాటు 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఇతర ఫీచర్లు
* ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 5జీ కనెక్టివిటీ
* బ్లూటూత్ 5.1
* ఎన్ఎఫ్‌సీ
* యూఎస్‌బీ టైప్ సి పోర్ట్
బ్యాటరీ, ఛార్జింగ్
మోటోరోలా ఎడ్జ్ ప్లస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చారు. వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్
అదనపు ఫీచర్లు.
ధర రూ.74,999
మోటోరోలా ఎడ్జ్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ థండర్ గ్రే కలర్ ఆప్షన్‌లో మాత్రమే విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.74,999. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రీ ఆర్డర్లు తీసుకుంటోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్‌పై 10% అంటే రూ.7,500 డిస్కౌంట్ ఇస్తోంది.