• తాజా వార్తలు

నోకియా 5310 మ్యూజిక్ ఎక్స్‌ప్రెస్ మ‌ళ్లీ వ‌చ్చింది.. 

నోకియా 5310 మ్యూజిక్ ఎక్స్‌ప్రెస్ ఫోన్ గుర్తుందా? స్మార్ట్‌ఫోన్లు రాక ముందు ఈ ఫోన్ అప్ప‌ట్లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది. 2007లో సోనీ ఎక్స్‌పీరియా మ్యూజిక్ ఫోన్ల‌కు దీటుగా నోకియా తీసుకొచ్చిన ఈ మ్యూజిక్ ఎక్స్‌ప్రెస్ ఫోన్ అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. బండ‌ల్లాంటి ఫోన్లు ఉండే నోకియాలో స్లీక్ డిజైన్‌తో రెడ్ అండ్ బ్లాక్ క‌ల‌ర్ కాంబినేష‌న్‌తో చూడ‌ముచ్చ‌ట‌గా ఉండేది. ఇక దీని మ్యూజిక్ హైలెట్ అనే చెప్పాలి. 13 ఏళ్ల నాటి ఈ ఫోన్‌ను మ‌ళ్లీ కొత్త‌గా తీసుకొచ్చింది నోకియా. ఫీచ‌ర్ ఫోన్లు వాడటానికి ఇష్ట‌ప‌డే వాళ్ల‌కు ఇది మంచి ఆప్ష‌న్ అని త‌యారీదారు అయిన హెచ్ఎండీఏ గ్లోబ‌ల్ ప్ర‌క‌టించింది. ఈరోజు లాంచ్ అయిన కొత్త నోకియా 5310 ‌ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల వివ‌రాలు మీకోసం..

ఇవీ ఫీచ‌ర్లు 
* 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే
* 8 ఎంబీ ర్యామ్‌
* 16 ఎంబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ 
* ఎస్‌బీ కార్డ్‌తో స్టోరేజ్‌ను 32జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు.
* వీజీఏ కెమెరా
* డ్యూయ‌ల్ సిమ్ 
* 1200 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. ఫీచ‌ర్ ఫోన్‌కాబ‌ట్టి డిస్‌ప్లే కూడా సాధార‌ణ‌మైన‌దే కాబ‌ట్టి ఈ బ్యాట‌రీని ఒక‌సారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే  20 గంట‌ల టాక్‌టైం వ‌స్తుంది.  22 రోజులు స్టాండ్‌బై బ్యాట‌రీ బ్యాక‌ప్ ఉంది.
* వైట్ అండ్ రెడ్‌, బ్లాక్ అండ్ రెడ్ క‌ల‌ర్ కాంబినేష‌న్స్‌లో దొరుకుతుంది. 

మ్యూజిక్ స్పెష‌ల్‌
నోకియా 5310 ఫీచ‌ర్ ఫోన్ మ్యూజిక్ స్పెష‌ల్ ఎడిష‌న్‌. బిల్ట్ ఇన్ ఎంపీ 3 ప్లేయ‌ర్ ఉంటుంది.  డ్యూయ‌ల్ స్పీక‌ర్లు ఫోన్ ఫ్రంట్ వైపు ఉంటాయి. వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో ఫీచ‌ర్ కూడా ఉంది. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఇచ్చారు. మ్యూజిక్ కంట్రోల్‌, సౌండ్ పెంచుకోవ‌డం, త‌గ్గించుకోవ‌డానికి ఫోన్ కుడివైపున రెండు బ‌ట‌న్లు ఉంటాయి.

ధ‌ర‌
3,999 రూపాయ‌లు. ఈ నెల 23 నుంచి అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో కొనుక్కోవ‌చ్చు. దీంతోపాటు నోకియా వెబ్‌సైట్‌లోనూ దొరుకుతుంది. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో జూలై 22న అమ్మ‌కాలు ప్రారంభ‌మ‌వుతాయి.