ఇప్పుడంతా బడ్జెట్ మొబైల్స్‌దే హవా. లాక్‌డౌన్‌లో ఫోన్లు పాడవడం, పిల్లల ఆన్‌లైన్ చదువుల కోసం అనివార్యంగా స్మార్ట్ ఫోన్లు కొనాల్సి రావడం.. మరోపక్క కరోనా దెబ్బకు ఆదాయాలు పడిపోవడంతో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు కొనేవాళ్లందరూ బడ్జెట్‌లో దొరికే స్మార్ట్‌ఫోన్ల వైపే చూస్తున్నారు. కంపెనీలు కూడా అందుకే ఈ సెగ్మెంట్‌పైనే దృష్టి పెట్టాయి. శాంసంగ్, రియల్‌మీ, ఒప్పో, తాజాగా షియోమి కూడా బడ్జెట్ మొబైల్స్‌ను మార్కెట్లోకి లాంచ్ చేశాయి.
మొదటి నుంచి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేసి ఇండియన్ మార్కెట్‌లో క్లిక్ అయిన షియోమి.. తాజాగా రెడ్‌మీ 9 పేరుతో మరో బడ్జెట్ రేంజ్ మొబైల్ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. 10వేల లోపే ధర ఉన్న ఈ ఫోన్లలో సూపర్ ఫీచర్లను తీసుకొచ్చింది. భారీ డిస్‌ప్లే, మెగా బ్యాటరీ, మంచి ర్యామ్ దీని సొంతం.
రెడ్‌మీ 9 స్పెక్స్ ఇవీ
* 6.53 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డాట్ వ్యూ డిస్‌ప్లే
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 చిప్‌సెట్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* 4జీబీ ర్యామ్, 13 ఎంపీ+2 ఎంపీ
* 64/ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. ఎస్డీ కార్డుతో 512 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.
* ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
కెమెరాలు
వెనుకవైపు రెండు కెమరాలున్నాయి. 13 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
ధర
రెడ్‌మీ9.. 64 జీబీ వేరియంట్ ధర రూ. 8,999. 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 9,999. అమెజాన్, ఎంఐ అషీషియల్ వెబ్‌సైట్‌లో కొనుక్కోవచ్చు. ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ ప్రారంభమవుతుంది. తర్వాత ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతుంది.