లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలు ఆలస్యంగా మార్కెట్లోకి వస్తోంది రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. వాస్తవానికి రెడ్‌మీ నోట్ 9 ప్రో మార్చిలోనే రిలీజయింది. ఆ తర్వాతే దీన్ని కూడా రిలీజ్ చేయాలని కంపెనీ భావించింది. అయితే కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మొదలైంది. ఈ పరిస్థితుల్లో రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అమ్మకాలు వాయిదాపడ్డాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు షియోమి ఆన్‌లైన్‌లో ఈ ఫోన్లను విక్రయించబోతోంది.
ఇవీ స్పెక్స్ అండ్ ఫీచర్స్
డిస్‌ప్లే: 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
ప్రాసెసర్: క‌్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720జీ ఎస్‌వోసీ
ర్యామ్: 6జీబీ/ 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ/ 128 జీబీ
ఆండ్రాయిడ్ 10 ఓఎస్
బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ సీ టైప్ పోర్ట్
5,020 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
నాలుగు రియర్ కెమెరాలు
రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్‌లో కెమెరాలే హైలెట్. వెనుకవైపు నాలుగు కెమెరాలతో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీల విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. దీనికి ఫిజికల్ బటన్ ఉండదు. ఇన్ డిస్‌ప్లే సెల్ఫీ షూటర్ అన్నమాట.
ఇవిగో ధరలు
* 6జీబీ ర్యామ్ ఫోన్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి.
* 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.16,499
* 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.17,999
* 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.19,999
అమెజాన్.ఇన్, ఎంఐ.కామ్‌ల్లో లభ్యం
లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ ఫోన్ ఆఫ్‌లైన్‌లో దొరకదు. అమెజాన్.ఇన్‌తోపాటు షియోమి అధికారిక వెబ్‌సైట్ ఎంఐ.కామ్‌లో దొరుకుతుంది.