ఒక పక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని కునుకు వేయనివ్వవడం లేదు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయితున్నాయి. ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని స్మార్టు ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్లు రిలీజ్ చేశాయి. ఎవరు కొంటారో, హిట్టవుతాయా, ఫట్టవుతాయా? అసలు ఏమిటీ కంపెనీల ధైర్యం? ఇలాంటి ప్రశ్నలేయకుండా జస్ట్ వాటి మీద ఒక లుక్కేయండి. కాస్త టైం పాస్ అవుతుంది.
ఒప్పో రెనో 3 ప్రో
ఒప్పో తన రెనో సిరీస్‌లో తీసుకొచ్చిన కొత్త ఫోన్ ఒప్పో రెనో 3 ప్రో. 6.4 అంగుళాల సూపర్ అమోల్డ్ డ్యూయల్ పంచ్ హోల్ డిస్‌ప్లే దీని సొంతం. మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్‌తో వచ్చిన తొలి ఫోన్ ఇది. 64, 13, 8, 2 ఎంపీ లెన్స్‌లతో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. 44 ఎంపీ సెల్ఫీకెమెరాతోపాటు ముందు వైపు 2 ఎంపీ టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. 4025 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్‌తో వచ్చింది.
బ్లాక్ షార్క్3 ప్రో, బ్లాక్ షార్క్ 3
మార్చి 3న చైనాలో రిలీజయ్యాయి. ఈ రెండూ గేమింగ్ స్మార్ట్ ఫోన్లే. 5జీతో పని చేస్తాయి. బ్లాక్ షార్క్ 3 స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తే.. ప్రో మోడల్ 7.1 ఇంచెస్ క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో రిలీజయింది. అంతే తప్ప మిగతా ఫీచర్లన్నీ రెండు ఫోన్లలోనూ దాదాపు ఒకటే. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 856 ఎస్‌వోసీ ప్రాసెసర్, ముందు, వెనుక మూడేసి కెమెరాలున్నాయి. వీటి ధర మన కరెన్సీలో 38 వేల నుంచి 50 వేల వరకు ఉంది.
రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో
మార్చి 5న లాంచయ్యాయి. రియల్‌మీ 5 సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా వీటిని తీసుకొచ్చారు. రియల్‌మీ 6 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల పంచ్ హోల్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తే.. ప్రో మోడల్ 6.6 ఇంచెస్ పంచ్ హోల్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో రిలీజయింది. వెనుక వైపు నాలుగు, ముందు రెండు కెమెరాలున్నాయి. 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ వూక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఈ ఫోన్‌లో ఇతర ఫీచర్లు. రియల్‌మీ 6 ధర 12,999. రియల్‌మీ 6 ప్రో 16,999.
మోటో జీ 8
మార్చి 8న బ్రెజిల్‌లో రిలీజయింది. మోటో జీ8 స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాల మ్యాక్సీవిజన్ డిస్‌ప్లేతో వచ్చింది. వెనుక వైపు మూడు, ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది , ధర 21,000
రెడ్‌మీ నోట్ 9ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్
మార్చి 12న లాంచయ్యాయి. రెండు ఫోన్లూ 6.67 అంగుళాల పంచ్ హోల్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వచ్చాయి. రెండింటిలోనూ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 720 జీ చిప్‌సెట్ ఉంది. 5020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ప్రోలో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటే ప్రో మ్యాక్స్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చారు వెనుక వైపు నాలుగు, ముందు రెండు కెమెరాలున్నాయి. ప్రోలో 48, 8, 5, 2 ఎంపీ సెన్సర్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు, ముందు వైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరాలున్నాయి. ప్రో మ్యాక్స్‌లో 64, 8, 5, 2 ఎంపీ సెన్సర్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు, ముందు వైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలున్నాయి. రెడ్‌మీ నోట్ ప్రో ధర 12,999. రెడ్‌మీ నోట్ ప్రో మ్యాక్స్ ధర 14,999.
శాంసంగ్ గెలాక్సీ ఏ11
మార్చి 11న లాంచయింది. 6.44 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. ఇన్‌ఫినిటీ ఓ డిస్‌ప్లేతో వచ్చింది. 8ఎంపీ సెల్ఫీ కెమెరా, ట్రిపుల్ రియర్ కెమెరాలున్నాయి. 2, 3 జీబీ ర్యామ్ వేరియంట్లు ఉన్నాయి. 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర ఎంతో తెలియదు.
శాంసంగ్ గెలాక్సీ ఏ21
మార్చి 18న లాంచయింది. 6.44 అంగుళాల సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ అల్ట్రా ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వచ్చింది. 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 48, 8, 5 ఎంపీ సెన్సర్లతో ట్రిపుల్ రియర్ కెమెరాలున్నాయి. 4, 6 జీబీ ర్యామ్ వేరియంట్లు ఉన్నాయి. 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లున్నాయి. 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ. ధర 12,999.
శాంసంగ్ గెలాక్సీ ఏ31
మార్చి 24న లాంచయింది. 6.4 అంగుళాల సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ అల్ట్రా ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వచ్చింది. 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 48, 8, 5, 5 ఎంపీ సెన్సర్లతో నాలుగు రియర్ కెమెరాలున్నాయి. 4, 6 జీబీ ర్యామ్ వేరియంట్లు ఉన్నాయి. 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లున్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ. ధర ఎంతో ఇంకా తెలియదు.
నోకియా 8.3 -5జీ
మార్చి 19న లాంచ్ అయింది. 5జీ సెగ్మెంట్‌లో నోకియాకు ఇదే తొలి ఫోన్. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765 ఎస్‌వోసీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 6.81 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. నోకియా 8.3 స్మార్ట్‌ఫోన్ 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్లతో వచ్చింది. వెనుకవైపు 64, 12,2,2 ఎంపీ సెన్సర్లతో కూడిన నాలుగు కెమెరాల సెటప్, ముందు వైపు 24 ఎంపీ సెల్పీ కెమెరా ఉన్నాయి.. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌తో కూడిన 4,500mAh బ్యాటరీ . ధర ఇండియాలో 50వేలు ఉంటుంది.
ఇవి కూడా ఇప్పుడే లాంచింగ్
* రెడ్‌మీ కే30 ప్రో
* మోటో రేజర్ 2010
* మోటో ఈ6 ఎస్
* జెడ్‌టీఈ ఆక్సాన్ 11 5జీ
* నుబియా రెడ్ మ్యాజిక్ 5జీ
* హువావే పీ 40
* హువావే పీ 40 ప్రో
* హువావే పీ 40 ప్రో ప్లస్
* హువావే పీ40 లైట్ ఈ
* ఎంఐ 10 లైట్ 5జీ