• తాజా వార్తలు

ఐపీఎల్ స్పెష‌ల్‌.. వివో- జియో బంప‌ర్ ఆఫ‌ర్

ఐపీఎల్‌ ఊపందుకుంది.. సంజు శాంస‌న్ సెంచ‌రీ, వోహ్రా 95, గేల్ మెరుపులు, కోహ్లీ టీంలోకి వ‌చ్చి కెప్టెన్సీ అందుకోవ‌డం, మ‌రోవైపు మెక్‌క‌ల్లం షాట్లు ఐపీఎల్‌ను స్పీడ‌ప్ చేశాయి. ఇక క్రికెట్ ల‌వ‌ర్స్‌కు పండ‌గే పండ‌గ‌. స‌మ్మ‌ర్ హాలీడేస్ వ‌చ్చేయడంతో స్టూడెంట్స్ కూడా ఐపీఎల్ తో ప్యార్ మే ప‌డిపోయాం అనేస్తున్నారు. ఈసారి ఐపీఎల్‌కు మెయిన్ స్పాన్స‌ర్ అయిన వివో మొబైల్ ఫోన్ల కంపెనీ.. ఈ క్రేజ్‌ను ఫుల్లుగా వాడేసుకోవాల‌ని డిసైడైపోయింది. జియోతో క‌లిసి వివో జియో క్రికెట్ మానియా ఆఫ‌ర్‌ను అనౌన్స్ చేసింది. వివో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ఆఫ‌ర్ కంద ఏకంగా 168 జీబీ వ‌ర‌కు డేటా గిఫ్ట్‌గా పొందే ఛాన్సుంది.
ఇదిగో ఆఫ‌ర్‌..
వివో జియో క్రికెట్ మానియా ఆఫ‌ర్‌ను పొందాలంటే మీరు వివో ఫోన్‌లో జియో సిమ్ నుంచి ఐపీఎల్‌లో మీ ఫేవ‌రెట్ టీమ్‌ను సెలెక్ట్ చేసుకుని మెసేజ్ పంపాలి. మీ టీం పెర్‌ఫార్మెన్స్ బ‌ట్టి మీకు డేటా వ‌స్తుంది. మ్యాచ్ నెగ్గితే 3 జీబీ, డ్రా చేసుకుంటే 2 జీబీ, ఓడిపోయినా కూడా 1 జీబీ డేటా ఫ్రీగా జియో నుంచి వ‌స్తుంది. మీ టీం నాకౌట్ కు క్వాలిఫై అయితే మీ డేటా కోటా డ‌బుల్ అవుతుంది. ఫైనల్‌కు వెళితే మూడు రెట్లు, చాంపియ‌న్‌గా నిలిస్తే నాలుగు రెట్ల డేటా మీ సొంత‌మ‌వుతుంది.