చైనా కంపెనీ షియోమి తన ప్రీమియం ఫోన్ల జాబితాలో మరో సూపర్ ఫోన్‌ను తీసుకొచ్చేసింది. పోకో ఎఫ్2 ప్రోను ఈ రోజు లాంచ్ చేసింది. ఇది పోకోలో సెకండ్ జనరేషన్ ఫోన్. దాదాపు రెండేళ్ల కిందట తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో ఎఫ్ 1ను రిలీజ్ చేసింది. అది యూజర్లను బాగా ఆకట్టుకోవడంతో దాని తర్వాత వెర్షన్‌ను తీసుకొచ్చింది. లాక్డౌన్‌తో కాస్త లేటయినా మార్కెట్లోకి లేటెస్ట్‌గా వచ్చింది.
ఇవీ ఫీచర్లు
డిస్‌ప్లే : 6.67ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ అమోల్డ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ఎస్‌వోసీ
ర్యామ్: 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్:128 జీబీ
పవర్‌ఫుల్ కెమెరాలు
వెనుక వైపు నాలుగు కెమెరాలున్నాయి. 64 ఎంపీ హై రిజల్యూషన్ మెయిన్ సోనీ కెమెరా, 13 మెగాపిక్సెల్‌తో 123 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ టెలీమాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్‌తో క్వాడ్రపుల్ కెమెరా సెటప్ ఉంది.
ఇక సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్ ఉంది. ఇది పాప్ అప్ కెమెరా కావడం విశేషం.
8కే వీడియో రికార్డింగ్, షూట్ స్టడీ వీడియో, వీడియో బొకే, వోగ్ మోడ్, సినిమాటిక్ మోడ్ అనే లేటెస్ట్ ఫీచర్లన్నీ ఈ ఫోన్‌తో వచ్చాయి.
5జీ కనెక్టివిటీ
పోకో ఎఫ్2 ప్రో 5 జీ కనెక్టివిటీతో వచ్చింది. వెనుక వైపున ఆప్టికల్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.
4700 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇచ్చారు. 30వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండటంతో కేవలం 63 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.
ధర 50 వేల వరకు
* నియాన్ బ్లూ, ఫాంటన్ వైట్, ఎలక్ట్రిక్ పర్పుల్, సైబర్ గ్రే నాలుగు రంగుల్లో ఈ పోకో ఎఫ్2 ప్రో దొరుకుతుంది.
* రెండు ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది.
* 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 41500
* 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ. 50,000