శాంసంగ్ గెలాక్సీ సిరీస్ తర్వాత అంతగా ఇప్పుడు ఎం సిరీస్ హవా నడుస్తోంది. అందుకే ఈ లైనప్‌లో మరో రెండు స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసింది. ఎంట్రీలెవల్ స్మార్ట్ ఫోన్ యూజర్లే లక్ష్యంగా శాంసంగ్ ఎమ్ 01, ఎమ్ 11 ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వాటి ఫీచర్లు, స్పెక్స్, ధర ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.
శాంసంగ్ ఎమ్ 01
డిస్‌ప్లే: 5.70 ఇంచెస్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే
ప్రాసెసర్: క్వా ల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 439
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
ర్యామ్: 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ
కెమెరాలు
శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 01లో వెనకవైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 13 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 2 ఎంపీతో మరో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ
ఎమ్ 01లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్స్ లేవు.
ధర: 8,999
శాంసంగ్ ఎమ్ 11
డిస్‌ప్లే: 6.40 ఇంచెస్ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లే
ప్రాసెసర్: క్వా ల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
ర్యామ్: 3జీబీ /4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ / 64 జీబీ
కెమెరాలు
శాంసంగ్ గెలాక్సీ ఎమ్11లో వెనకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 13 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 5 ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ
ఎమ్ 11లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ ఇచ్చారు.
ధర 3జీబీ ర్యామ్/ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ధర 10,999
4జీబీ ర్యామ్/ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ధర 12,999