• తాజా వార్తలు

పదివేలు పెడితే చాలు, ఈ బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్స్ మీ సొంతం

ఇండియా మార్కెట్లో వారం వారం ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. అయితే విడుదలైన ఫోన్ కొనుగోలు చేద్దామనుకునే లోపు మరో కొత్త ఫోన్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో కొనుగోలు దారులు కొంచెం గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఎన్ని ఫోన్లు విడుదలయినా ఫోన్ కొనుగోలుకు కేవలం రూ. 10 వేలు మాత్రమే వెచ్చిస్తే బాగుంటుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పెట్టి ఫోన్లు కొంటే అవి డ్యామేజి అయినా, లేక మిస్సింగ్ అయినా అయ్యో అనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో మంచి ఫీచర్లతో ఈ మధ్య విడుదలైన బెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి. 

Samsung Galaxy M10
గెలాక్సీ ఎం10 2జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.7,990 ఉండ‌గా, 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.8,990గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం10 ఫీచర్లు
6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7870 ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3430 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Xiaomi Redmi Note 7S
రెడ్‌మీ నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆనిక్స్ బ్లాక్‌, స‌ఫైర్ బ్లూ, రూబీ రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లయింది. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,999 ధ‌ర‌కు, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. 
రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, స్ల్పాష్ ప్రూఫ్ కోటింగ్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

Xiaomi Redmi 7
దీని ధర రూ. 7,499గా ఉంది.
షియోమీ రెడ్‌మీ నోట్‌7 ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

Realme 3
రియ‌ల్ మి 3 డైన‌మిక్ బ్లాక్‌, రేడియెంట్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడులైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ను రూ.8,999 ధ‌రకు, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ను రూ.10,999 ధ‌ర‌కు అందుబాటులో ఉంది.
రియ‌ల్ మి 3 ఫీచ‌ర్లు
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Honor 9 Lite
ఇక ఈ ఫోన్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ వేరియెంట్లలో రూ.10,999, రూ.14,999 ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.
హానర్ 9 లైట్ ఫీచర్లు
5.65 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Xiaomi Mi A2
షియోమీ ఎంఐ ఎ2 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Samsung Galaxy M20
గెలాక్సీ ఎం20 3జీబీ ర్యామ్ ధ‌ర రూ.10,990 ఉండ‌గా, 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.12,990 ఉంది.
గెలాక్సీ ఎం20 ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.