ప్రముఖ సెల్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గెలాక్సీ ఎస్ 8+కు అప్‌గ్రేడ్ మోడల్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే 4జీబీ ర్యామ్‌తో వచ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ రెండింటినీ పెంచుతూ కొత్త వేరియంట్ ను ప్రవేశపెట్టింది.
ఫీచర్లలో మార్పు లేదు
ఇంతకు ముందు 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చిన ఎస్ 8+కి ఇది అప్‌గ్రేడ్ మోడల్. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. రెండు వేరియంట్లలోనూ ఇంటర్నల్ మెమరీని 256 జీబీ వరకు ఎస్‌డీ కార్డుతో ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. 6.2 ఇంచెస్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 8ఎంపీ రియర్ కెమెరాతోపాటు మిగిలిన ఫీచర్లన్నీ సేమ్ టు సేమ్.
నేటి నుంచి ప్రీ ఆర్డర్లు
మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌లో ఈ కొత్త ఎస్ 8+ వేరియంట్ లభిస్తుంది. ధర రూ.74,990. అంటే 4జీబీ మోడల్ కంటే 10 వేలు ఎక్కువ. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. 9వ తేదీ నుంచి ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా దొరుకుతుంది.