చైనా కంపెనీ హువావే సెల్‌ఫోన్ మార్కెట్‌లో షేర్ పెంచుకోవడంమీద గట్టిగానే ఫోకస్ చేసింది. తన సబ్‌బ్రాండ్ హానర్ నుంచి కొత్తగా హానర్ 7ఎ, 7సి స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తెచ్చింది. 5.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉన్నహానర్ 7ఏ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 చిప్‌సెట్, 3జీబీ ర్యామ్ ఉన్నాయి. 13ఎంపీ, 2 ఎంపీ రియర్ కెమెరా సెటప్, ఫ్రంట్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ సెల్ఫీ లైట్. ఈఎంఐయూఐ8.0 బేస్డ్ ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉన్న ఈ ఫోన్‌లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 3 జీబీ రామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న 7ఏ ధర 8,999 రూపాయలు. హానర్ 7సీలో స్క్రీన్ సైజ్ 5.99 ఇంచెస్. మిగతా ఫీచర్లన్నీ 7ఏ మాదిరిగానే ఉన్నాయి. ధర 9999 రూపాయలు. అయితే ఈ ఫీచర్లతో దాదాపు ఇదే ప్రైస్ రేంజ్‌లో ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే కొన్ని ఫోన్లున్నాయి. అవేంటో చూద్దాం.
రెడ్‌మీ నోట్ 5
మంచి బిల్ట్ క్వాలిటీ, డీసెంట్ డిస్‌ప్లే, ఎక్స్‌లెంట్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఈ ఫోన్ కూడా 5.99 ఇంచెస్ స్క్రీన్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నౌగట్ ఓఎస్‌తో రన్నయ్యే ఈ ఫోన్‌లో 12 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ 4000 ఎంఏహెచ్ ఉండడంతో ఎక్కువ సేపు నడుస్తుంది. 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న రెడ్‌మీ నోట్ 5 ధర 9,999 రూపాయలు.
రీఆల్మ్1 (Realme 1)
స్టైల్, పెర్‌ఫార్మెన్స్ రెండూ కావాలనుకుంటే ఒప్పో తన సబ్‌బ్రాండ్‌గా రిలీజ్ చేసిన రీఆల్మ్ 1ను ట్రై చేయొచ్చు. ఫైబర్ గ్లాస్ బాడీ, వెనకవైపు గ్లాసీ డైమండ్ ఎఫెక్ట్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. 6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వచ్చిన రీఆల్మ్1 ఫోన్‌లో హీలియో పీ 60 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండడంతో పెర్‌ఫార్మెన్స్ బాగుండే అవకాశాలున్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఎకూడిన 12 ఎంపీ రియర్ కెమెరా ఉంది. ఇక ఫ్రంట్ 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి ఏఐ బ్యూటీ 2.0టెక్నాలజీని ఇంటిగ్రేట్‌చేశారు. దీనితో ఇది ఫేషియల్ రిగ్నైజేషన్‌కు కూడా పనికొస్తుంది. ధర 8,990
10 ఆర్ జీ (10.or G)
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రానగ్ 626 సీపీయూ, ఆడ్రినో 506 జీపీయూతో కలిసి వచ్చిన 10 ఆర్ జీ మొబైల్ స్పెక్యులేషన్ పరంగా మంచి ఛాయిస్. ఎలాంటి లాగ్ లేకుండా ఫోన్ సమూత్‌గా రన్నవుతుంది. 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్న ఈ ఫోన్ ధర 9,999 రూపాయలు.
మోటో జీ 5ఎస్ (Moto G5s)
5.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్న మోటో జీ 5ఎస్ ఫోన్ ఆండ్రాయిడ్ నోగట్ ఓఎస్‌తో రన్నవుతుంది. 16ఎంపీ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉన్న 5 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. లోలైట్‌లో కూడా సెల్పీలు బాగా తీసుకోవచ్చు. 4జీబీ ర్యామ్ ఉండడంతో ఫోన్ బాగా పనిచేస్తుంది. ధర 9,999 రూపాయలు.