• తాజా వార్తలు

అభిమానులు రెడీగా ఉండండి, JioPhone 3 వచ్చేస్తోంది 

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్న రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ మార్కెట్లో దుమ్మురేపిన సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే జియో గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి జియో ఎంటరవుతోంది. సుదీర్ఘం కాలం పరీక్షల  అనంతరం ఆగస్టు 12 న జరగబోయే కంపెనీ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా  కమర్షియల్‌గా లాంచ్‌  చేయనుంది.  జియో గిగా ఫైబర్‌తో పాటు  జియోఫోన్ 2 కి కొనసాగింపుగా అప్‌గ్రేడ్ వెర్షన్‌తో జియో ఫీచర్‌ ఫోన్‌ 3 ని తీసుకురానుంది.  జియోఫోన్‌ 2 కంటే  ఆకర్షణీయ  ఫీచర్లతో, దాదాపు అన్ని అంశాలలో మరింత శక్తివంతంగా  తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. Jio Phone 3 పేరుతో ఓ ఫీచర్ ఫోన్‌పై టెస్టింగ్ కూడా కొనసాగుతున్నట్టు పేర్కొంది. అయితే రిలయన్స్ జియో మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రివీల్ చేయలేదు.

జియో ఫోన్‌3 ఫీచర్ల పై అధికారిక సమాచారం వెల్లడి కానప్పటికీ  కొన్ని వివరాలు బయటకు వచ్చాయి 4జీ టెక్నాలజీతో జియోఫోన్ 3 మీడియాటెక్ చిప్‌సెట్‌తో రానుంది. 5 అంగుళాల టచ్‌ స్క్రీన్‌తో, పవర్‌ఫుల్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో చాలా స్మార్ట్‌గా జియో ఫోన్‌ 3ని ఆవిష్కరించనుంది. 2జీబీ ర్యామ్‌, 64 స్టోరేజ్‌ సామర్ధ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుందట. ధర విషయానికి వస్తే రూ. 4500 అందించనుందని  అంచనా. అంతేకాదు  5 ఎంపీ రియర్‌ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను పొందుపరచినట్టు తెలుస్తోంది.

జియో ఫోన్ 2 కంటే రాబోయే జియోఫోన్ 3 అత్యంత శక్తివంతంగా ఉంటుందని అంచనా. ఈ కొత్త ఫోన్ Media Tek ప్రాసెసర్‌తో Jio Phone 2కు అప్ గ్రేడ్ వెర్షన్‌‌గా ప్రత్యేక ఆకర్షణతో నిలువనుంది. 2019 ఏడాదిలో రిలయన్స్ జియో కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్ చేస్తుందా? లేదా అనేదానిపై ఇప్పటివరకూ కచ్చితమైన రిపోర్టులు లేవు.

ఇదిలా ఉంటే దేశీయ అతిపెద్ద  రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ సర్వీస్ సంస్థ  డైన్అవుట్‌తో జియో జత కట్టింది. డైన్‌ అవుట్‌ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ రెస్టారెంట్ ఫెస్టివల్‌‌కు రిలయన్స్ జియో డిజిటల్  భాగస్వామిగా మారి కస్టమర్లకు  ప్రత్యేక  తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. 2019 ఆగస్ట్ 1 నుంచి మొదలైన ఈ ఫెస్టివల్‌  2019 సెప్టెంబర్ 1వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణె, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, చండీగఢ్, గోవా, జైపూర్, లక్నో, ఇండోర్, సూరత్, కొచ్చి, లుధియానా, నాగ్‌పూర్ నగరాల్లో ఈ ఫెస్టివల్ జరుగుతుంది.

ఈ ప్లాట్‌ఫాంలో జియో యూజర్లు చేసుకునే మొదటి బుకింగ్‌పై రూ.100 తగ్గింపు లభిస్తుంది. అలాగే  బిల్లుపై  ప్రత్యేక డిస్కౌంట్‌ను కూడా అందిస్తుంది.  దీంతోపాటు ఫుడ్, డ్రింక్స్, బఫేపై 1+1 ఆఫర్స్ పొందొచ్చు.  డైన్అవుట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న 17 పట్టణాల్లో, ఎనిమిదివేలకు పైగా  రెస్టారెంట్లలో ఈ తగ్గింపు లభిస్తుంది.  మైజియో యాప్‌ ద్వారా జియో యూజర్లు కూపన్స్ సెక్షన్‌లో డిస్కౌంట్ కోడ్ పొంది,  డైన్అవుట్ ప్లాట్‌ఫామ్‌లో కూపన్స్ రీడీమ్ చేసుకోవచ్చు.