ప్రముఖ కంజ్యూమర్ ఎలక్ర్టానిక్స్, మొబైల్ ఉత్పత్తిదారు ఎల్‌జీ రూపొందించిన ఎల్‌జీ జీ6 స్మార్ట్‌ఫోన్లను ఏప్రిల్ చివరి వారంలో భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి దీన్ని మార్చి చివరి వారంలో రిలీజ్ చేస్తారని భావించినా ఎందుకో అనుకున్న సమయానికి ఇండియన్ మార్కెట్ కు అందించలేకపోయారు. దీంతో ఈ నెల చివరి నాటికి ఇండియన్ మార్కెట్లో ఎల్ జీ జీ6 ఎంట్రీ తప్పదని చెబుతున్నారు.
కాగా ఈ అల్ర్టా మొబైల్ ధర కాస్త ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. రూ.49,999 ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే బార్సిలోనాలో నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో ఈ మోడల్‌ని ప్రదర్శించారు. ఇది గత ఏడాది విడుదల చేసిన ఎల్‌జీ జీ5 తరువాతి వెర్షన్.
ఫీచర్లు
* 5.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకే తెర
* గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్ , డాల్బీ విజన్
* ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్
* క్వాల్కామ్ ఎంఎస్‌ఎం 8996 స్నాప్ డ్రాగన్821 ప్రోసెసర్
* 4జీబీ ర్యామ్
* 35 జీబీ అంతర్గత మెమెరీ, 2 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు
* రెండు 13 మెగాపిక్సల్ వెనుక కెమెరా లు
* 5 మెగాపిక్సల్ ముందు కెమెరా
* 3300 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ
ఇంకా ఏమున్నాయ్..
* ఇవి కాకుండా ఫింగర్ ప్రింట్ సెన్సర్లు, యాక్సెలరో మీటర్, గైరో, ప్రాక్సిమిటీ, కంపాస్, బారోమీటర్ వంటివన్నీ ఉన్నాయి.
* మిస్టిక్ వైట్, ఆస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం రంగుల్లో దొరకనుంది.