చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇండియన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ మొత్తం మీద కన్నేశాయి. సెల్‌ఫోన్లతోపాటు స్మార్ట్‌వాచ్‌లలాంటి వేరబుల్స్, స్మార్ట్‌టీవీలు అన్నింటినీ ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేశాయి. తాజాగా షియోమి.. నోట్‌బుక్ లను గురువారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎంఐ నోట్ బుక్ 14 పేరుతో వీటిని తీసుకొచ్చింది. దీనిలోనే హారిజన్ ఎడిషన్‌ను కూడా లాంచ్ చేసింది.
ఎంఐ నోట్‌బుక్ 14 స్పెక్స్ ఏమిటంటే..
* చూడముచ్చటైన డిజైన్
* కళ్లకు ఇబ్బంది కలిగించని 14 అంగుళాల యాంటీగ్లేర్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
* 8 జీబీ ర్యామ్
* 256/ 512 జీబీ స్టోరేజ్
* ఇంటెల్ కోర్ 10వ జనరేషన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్.. కోర్ ఐ5,ఐ7 వేరియంట్లు కూడా ఉన్నాయి.
* విండోస్ 10 ఓఎస్
* 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
* 1.5 కిలోల బరువు
* ఎంఐ హెచ్‌డీ వెబ్‌కామ్ (బండిల్డ్ ఆఫర్‌గా వస్తుంది)
ఎంఐ నోట్‌బుక్ 14 హారిజన్ స్పెక్స్ ఏమిటంటే..
* చూడముచ్చటైన డిజైన్
* కళ్లకు ఇబ్బంది కలిగించని 14 అంగుళాల యాంటీగ్లేర్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
* 8 జీబీ ర్యామ్
* 512 జీబీ స్టోరేజ్
* ఇంటెల్ కోర్ 10వ జనరేషన్ కోర్ ఐ 7 క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* విండోస్ 10 ఓఎస్
* 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
* 1.35 కిలోల బరువు
* ఎంఐ హెచ్‌డీ వెబ్‌కామ్ (బండిల్డ్ ఆఫర్‌గా వస్తుంది)
ధరలు ఇవీ
* ఎంఐ నోట్‌బుక్ 14 (256 జీబీ): రూ .41,999
* ఎంఐ నోట్‌బుక్ 14 (512 జీబీ): రూ .44,999
* ఎంఐ నోట్‌బుక్ 14 (ఎన్ విడియా జిపియుతో 512 జీబీ) : రూ .47,999
* ఎంఐనోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్ (కోర్ ఐ 5): రూ 54,999
* ఎంఐ నోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్ (కోర్ ఐ 7): రూ .59,999
జులై 16వరకే ఈ ధరలు
ఎంఐ నోట్‌బుక్, హారిజన్‌లను ప్రారంభ ఆఫర్‌గా రూ. 41999, రూ.54999గా పెట్టింది. ఈ ప్రారంభ ఆఫర్ ధరలు జూలై 16 వరకు మాత్రమే చెల్లుతాయని షియోమి ప్రకటించింది.
హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొంటే 2వేల రూపాయల తగ్గింపు ధర అందిస్తుంది. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. జూన్ 17 నుంచి అమెజాన్, షావోమి ఆన్ లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ వీటిని కొనుక్కోవచ్చు.